Pages

Wednesday, December 2, 2009

అసుర సంధ్య - 1

చుట్టు సముద్రం….నిర్మానుష్యమయిన దీవి…….ఎత్తయిన కొండలు……దట్టంగా పరుచుకున్న చీకట్లు. ఆ చీకట్లో, దారి వెతుక్కుంటూ చెట్లను తడుముకుంటు ఒక మానవాకారం అడుగులొ అడుగు వేసుకుంటూ నడుస్తొంది. ఇంతలో ఉన్నట్టుండి హోరు గాలి మొదలయ్యింది. దట్టమయిన మేఘాలు కమ్ముకోసాగినై. టపటపా సూదుల్లా చినుకులు మొదలయ్యాయి.కన్ను పొడుచుకున్నా కాన రాని చీకట్లొ ఆ ఆకారం ముందుకు నెమ్మదిగా సాగుతొంది. ఆకాశానికి చిల్లు పడినట్టుగ కురుస్తొంది వాన. ఫెటెల్మని ఒక మెరుపు మెరిసింది. చెవులు చిల్లులు పడె శబ్దం. యాభై గజాల దూరంలొ ఉన్న పెద్ద మర్రి చెట్టు మీద పిడుగు పడింది. ఆ పిడుగు పాటుకి పచ్చటి చెట్టు నిలువునా బూడిదయ్యింది...

ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఆలేఖ్య. నుదుట పట్టిన చెమటని తుడుచుకుంటు కంగారుగా చుట్టు చూసింది. అప్పటికి కాని తను నిద్రలొ కల కన్నట్లు అర్ధమవ్వలేదు. పసిఫిక్ సముద్రం మీదుగ భూమికి 60వేల అదుగుల ఎత్తులొ ప్రయాణిస్తొంది బ్రిటీష్ ఎయిర్వేస్ కి చెందిన విమాణం. తననే ఆందోళనగా చూస్తున్న వివేక్ వంక 'ఏం ఫర్వలేదు ' అన్నట్లుగ కళ్ళతోనె సైగ చేసింది. చికాగొలో జరగనున్న ఆర్కియాలజిస్ట్స్ సెమినార్ కి భారత దేశం నించి వెళ్తున్న పదిహేను మంది బృందంలో వివేక్, ఆలేఖ్య ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయ్యారు.

కిటికీలోంచి బయటికి చూసిన ఆలేఖ్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన కలలో చూసిన ఉధృతమైన వాన మరోసారి కళ్ళముందు మెదిలింది. కలలో చూసిన దృశ్యాలే కళ్ళ ముందు మెదిలెటప్పటికి మనసంతా అదోరకమైన వ్యాకుళతతో నిండిపోయింది. విమాణం తుఫానులో చిక్కుకుంది అని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. విమాణంలొ ఉన్న ప్రయాణికులు కంగారు పడకుండా ఎయిర్ హోస్టెస్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి పరిస్థుతులలోను చెరగని చిరునవ్వుతో ఉండగల నేర్పు ట్రైనింగ్ లోనే నేర్పుతారు. లండన్ నించి టేకాఫ్ తీసుకునెటప్పుడు తుఫాను ఇంత ఉధృతంగా లేదు. తుఫాను ఉన్నట్లుండి బలపడింది. అదే విషయాన్ని పైలట్ ప్రయాణికులందరికి పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ద్వార రిపీటెడ్ అన్నౌన్సెమెంట్స్ చేస్తున్నాడు.

మరోసారి పబ్లిక్ అడ్రెస్స్ సిస్టంలొ పైలట్ కంఠం వినిపించింది. 'ఒన్ ఆఫ్ అవర్ పాస్సెంజెర్స్ నీడ్ మెడికల్ అస్సిస్టెన్స్. పాస్సెంజెర్స్ లిస్ట్ లొ డాక్టర్స్ ఎవరు లేరు. సహాయ పడగల వాళ్ళు దయచేసి కౄని సంప్రదించండీ. ప్రతీ డాక్టర్ విమాణ ప్రయణం చేసేటప్పుడు విధిగ తను డాక్టర్ అని డిక్లేర్ చెయ్యాలి. ఆలేఖ్య ముందు సీట్లొ వ్యక్తి పేరు డాక్టర్ జేంస్ పాట్రిక్సన్. అతను లేచి దగ్గరలో ఉన్న ఎయిర్ హొస్టెస్స్ ని పిలిచాడు. విమాణం షెడ్యుల్ కొద్దిగా లేట్ అవ్వడంతొ ఎవరొ పాస్సెంజెర్ ఇంజెక్షన్ తీసుకొవడం మర్చిపోయాదు. అతనికి ఇంజెక్షన్ ఇచ్చి జేంస్ తన సీట్ కి తిరిగి వచ్చాదు. కూర్చునేముందు ఆలేఖ్య వంక చూసి పలకరింపుగా నవ్వి కూర్చున్నాడు. మరో ఆరు గంటలు ప్రయాణం చెయ్యలి అనుకుంటు ఆలేఖ్య తన ముందు ఉన్న మాగజెన్స్ తిరగెయ్యడం మొదలు పెట్టింది. అలా కొంతసేపు చదివాక తనని ఎవరొ చూస్తున్నట్టనిపించి తల ఎత్తింది. అప్పటి దాక ఆలేఖ్యనె చూస్తున్న వివేక్ చప్పున చూపు తిప్పుకున్నాడు. వివేక్ స్వతహాగ తన పని తను చూసుకునే రకం. డిగ్రీ నించి కలిసి చదువుకుని, ఒకే చోట ఉద్యోగం వచ్చినా కూడ స్వతంత్రంగ ఆలేఖ్యని పలకరించితె తప్ప పలకరించడు. చాలా బిడియస్తుడు. వివేక్ కి ఆలేఖ్య అంటె ఇష్టమని చదువుకునే రొజుల్లోనె ఆలేఖ్య గమనించింది. తనంతట తను వచ్చి ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చెస్తాడా అని ఆరు సంవత్సరాలుగా ఎదురు చూస్తొంది. ఇక వివేక్ ప్రపోజ్ చెసేదాకా వెయిట్ చెయ్యడం లాభం లేదు అనుకుని ఆలేఖ్య సూటిగ వివేక్ కళ్ళలొకి చూస్తూ అడగనే అడిగింది 'వివేక్! నా మీద నీ అభిప్రాయం ఎంటి?'

ఎటువంటి మగడు అయినా ఒక అమ్మాయి అలా అడిగితె ఉక్కిరిబిక్కిరి అవుతాడు. వివేక్ కూడా అందుకు అతీతుడేమీ కాదు. ఆలేఖ్య మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వలేదు. ముందు ఆశ్చర్యం, అంతలోనె ఆనందం....ఎగిరి గంతులెయ్యాలనిపించింది వివేక్ కి. తిరిగి సమాధానం చెబుదాం అనుకునేంతలోపె ఆకాశంలో పెద్ద మెరుపు. సరిగ్గా వీళ్ళ విమాణం మీద పిడుగు పడింది. ఆ ధాటికి వీళ్ళ విమానం మూడువేల అడుగులు కిందకి జారింది. అతికష్టమ్మీద పైలట్ విమనాన్ని తిరిగి తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. పైలట్లిద్దరు చిన్న నిట్టూర్పుతొ రెలీవ్ అయ్యారు. కాని ఆ అనందం ఎక్కువ సేపు నిలబడలేదు. విమానం ఏ.టి.సి. తొ సంబంధం కోల్పోయింది.

పైలట్లు కంగారుగా ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. ఇంతలోనే మరో పిడుగు సరిగ్గా వీళ్ళ విమానం మీద పడింది. ఆ ధాటికి విమానం ఎడం రెక్క సగానికి తెగిపోయింది. విమానం సెకనుకి వెయ్యి అడుగులు కిందకి జారిపోసాగింది.రెక్కలు తెగిన పక్షిలా గాలివాటుకి కిందకి జారడం మొదలుపెట్టింది. పైలట్లు ఇద్దరికీ ఏమి జరిగిందో అర్థం అవ్వడానికి కొద్ది సమయం పట్టింది. ఇంతలోపు విమానం అయిదు వేల అడుగులు కిందకి జారిపోయింది. విమానంలో ఉన్న ప్రయనికులంతా కంగారుగా అరవడం మొదలుపెట్టారు. ఎయిర్ హోస్టెస్ కూడా ఏమి చెయ్యలేని పరిస్థితి. పైలట్ విమానాన్ని కంట్రోల్ చెయ్యడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నాడు. ఇంతలొ పైలట్ ముందున్న కంట్రోల్ పానెల్స్ అన్ని ఒక్కసారిగా జీవం పోసుకున్నట్టుగా అరవడం మొదలుపెట్టాయి. అది చూస్తూనే పైలట్ కి విషయం అర్థం అయ్యింది. అప్పటిదాకా ఏదో ఒక మూల మిగిలి ఉన్న ఆశ కూడా మటుమాయం అయిపొయింది. విమానానికి ఇంధనం సప్లై చేసే పైపు పిడుగు వల్ల ముక్కలు ముక్కలయింది. ఇంధనం కూడా ఎక్కువ సేపు రాదు. మహా అయితే రెండుమూడు నిముషాల్లో ఇంధనం అంట బయటికి పంప్ చేయబడుతుంది. ఇంధనం ట్యాంక్ లో ఇంధనం అత్యధిక పీడనాల వద్ద నిల్వ ఉంచబడుతుంది. అందువల్ల ఇంధనం ట్యాంక్ ఏమాత్రం బలహీనంగ ఉన్న విమానం పేలిపోతుంది. విమానంలో ఎమర్జెన్సీ వచినప్పుడు పైలట్ ఎజేక్షన్ సిస్టం ఉంటుంది. పైలట్లిద్దరూ కేవలం పదిహేను సెకండ్ల సమయంలో విమానం నించి దూరంగా విసిరేయ్యబడతారు. పైలట్లిద్దరికీ ప్రయనికులని నడిసముద్రంలో వదిలి వెళ్ళడానికి మనసు రాలేదు. అదొక్కటే కారణం కాదు. వాళ్ళు ఉన్నది నడి సముద్రం లో వాళ్ళు భూభాగం చేరడానికి ఇంకా నాలుగు వందల నాటికల్ మైళ్ళ దూరం ఉంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని రెస్కుటీం రావడానికి కనీసం రెండు రోజులు పడుతుంది. తుఫానులో నడి సముద్రంలో కేవలం పారాచుట్ల సాయం తో సముద్రంలో ఉండడం ఆత్మహత్య సదృశ్యం . చావూ ఎలాగు తప్పనప్పుడు చివరి దాక పోరాడడమే మంచిది. పైలట్లిద్దరూ అదే చేస్తున్నారు. చూస్తుండగానే భూమికి కేవలం నాలుగు వందల అడుగుల ఎత్తుకి వచ్చింది. చివరి ప్రయత్నం గ పైలట్ బలంగా విమానాన్ని కుడి వైపు కి తిప్పాడు. అద్రుష్టం బాగుండి గాలివాటుకి మరో రెండు వందల అడుగుల ఎత్తుకి లేచింది విమానం. ఆ కొద్ది అవకాశాన్ని పైలట్ సద్వినియోగం చేసుకున్నాడు.విమానం గాలి వాటుకి పైకి లేవగానే విమానాన్ని మరింత పైకి తీసుకువెళ్ళాడు. పైలట్ కి తెలుసు అది కేవలం చావుని ఆలస్యం చేయడానికి చేసే చిరు ప్రయత్నమని.అలా పైకి లేచినప్పుడు పైలట్ కి దూరంగా కొన్ని పక్షులు కనిపించాయి. సముద్రం లో ఉండే చిన్న చిన్న ద్వీపాల మీద ఆవాసం ఏర్పరుచుకుంటాయి కొన్ని చిన్న చిన్న పక్షులు. ద్వీపం నించి కేవలం పది నిమిషాల దూరంలో తిరిగుతూ ఉంటాయి. వాటిని చూడగానే పైలట్ కి బతుకుతామన్న ఆశ చిగురించింది. అదే విషయాన్నీ పబ్లిక్ అడ్డ్రేస్సింగ్ సిస్టంలో చెప్పాడు. ఆ చివరి నిమిషంలో ఎక్కువ మంది ప్రయాణికులు భయంతో బిగుసుకుపోయి ఉన్నారు. పైలట్ చెప్పిన విషయం విన్న వాళ్ళు చాల తక్కువ మంది. విమానం మరికొంత ముందుకి వెళ్లి బలంగా సముద్రాన్ని గుద్దుకుంది. నీళ్ళను తాకిన మరుక్షణం విమానం రెండు ముక్కలు అయ్యింది. విమానం లో ఉన్న ప్రయాణికులు, వాళ్ళ సామాన్లు చెల్లాచెదురుగ నీళ్ళలోకి విసిరివేయ బడ్డాయి. విమానం నీళ్ళని గుద్దోకోగానే కొంత మంది ప్రయాణికులు ఆ ధాటికి తట్టుకోలేక ప్రాణాలు విడిచారు. కొంత మంది నీళ్ళలో మునిగిపోయారు. చాల కొద్దిమంది మాత్రమే ఈదడం మొదలుపెట్టారు. విమాన శకలాలని తప్పించుకుంటూ అంతకు ముందు పైలట్ చెప్పిన వైపు ఈత మొదలుపెట్టారు బతికి ఉన్న కొద్దిమంది. అలా ద్వీపం వైపు ఈదుకుంటూ వెళ్ళిన వాళ్ళు పట్టుమని ఎనిమిది మంది కూడా లేరు. ఒడ్డుకి చేరుకున్నాక అందరు సొమ్మసిల్లి పడిపోయారు. అటువంటి ప్రమాదాన్ని వాళ్ళు జీవితంలో చూడలేదు.చూడడం వేరు ప్రమాదంలో ఉండడం వేరు. అలసటతో, భయం తో అందరికి స్పృహ తప్పిపోయింది. అలా ఎంత సేపు ఉన్నారో తెలిదు. అందరికన్నా ముందు తెలివి తెచుకున్నది జేమ్స్. లేవగానే ఒక్క క్షణం ఎక్కడున్నదీ గుర్తు రాలేదు. తరవాత మెల్లగా జరిగిందంతా నెమ్మదిగా కళ్ళ ముందు మేదిలేటప్పటికి నుదుటన చెమటలు ప్రత్యక్షమయ్యాయి. నెమ్మదిగా పరిసరాలు గమనించేటప్పటికి కొన్ని శవాలు, సామాన్లు విమాన శకలాలు కనిపించాయి. అలా ఒడ్డు వెంబడి నడవడం మొదలు పెట్టాడు. కనిపించిన ప్రతి శరీరాన్ని పరిక్షిండం మొదలు పెట్టాడు. స్వతహాగా డాక్టర్ అవ్వడం వల్ల త్వరగానే జరుగుతోంది. అలా మొత్తం మీద ఇరవయి నలుగు మృతదేహాలని పరీక్షించాడు. కేవలం ఏడు మందిని పొడి ప్రదేశానికి చేర్చాడు. సుమారుగా ఎవ్వరికి పెద్ద దెబ్బలు తగల్లేదు. నెమ్మదిగా ఒక్కొక్కరికి స్పృహ రావడం మొదలయ్యింది. జేమ్స్, ఆలేఖ్య, వివేక, లీ, మిత్ర, నాయర్, క్రిస్టినా, గ్రెగ్ మిగిలారు.

No comments:

Post a Comment