Pages

Wednesday, December 2, 2009

అసుర సంధ్య - 3

పొద్దున్న అందరు లేచాక చూస్తె, నాయర్ కనిపించలేదు. అడవిలోకి వెళ్ళాడు ఏమో అనుకున్నారు.రెండు గంటలయినా నాయర్ తిరిగి రాలేదు. వివేక్-ఆలేఖ్య, గ్రెగ్-క్రిస్టినా, లీ-జేమ్స్ మూడు జట్లుగా ఏర్పడి, మూడు వైపులకి వెళ్లారు. అందరు ఒక గంట తర్వాత తిరిగి వచేయ్యాలి అని అనుకున్నారు. గంట తరవాత, అందరు తిరిగి వచ్చేసారు. ఎవరికీ నాయర్ ఎటు వెళ్ళాడు అన్న విషయం అంతుచిక్కలేదు. "ఒక వేళ గుహ లోకి వెళ్ళాడు ఏమో" అంది ఆలేఖ్య. అందరు కలిసి గుహలోకి వెళ్లారు. అక్కడ గుహలోకి కొంచెం లోపలి వెళ్ళాక, నాయర్ శవమై కనిపించాడు. జేమ్స్ దగ్గరికి వెళ్లి చూసి, "సఫకేషన్ వాళ్ళ చనిపోయాడు" అన్నాడు. కాని నడుస్తున్న వాడు ఉన్నట్టుండి అలా ఎలా సఫకేట్ అయ్యాడో ఎవరికీ అర్థం అవ్వలేదు. అయిన అర్థ రాత్రి నాయర్ కి గుహ లో ఎం పని? ఎంత ఆలోచించిన సమాధానం దొరకలేదు ఈ ప్రశ్నలకి.
జేమ్స్ నాయర్ శవాన్ని జాగ్రత్తగా పరీక్షించాడు ఎక్కడన్నా ఎటువంటి దేబ్బలయిన ఉన్నాయేమో అని. కానీ ఒక్కటి కూడా కనిపించలేదు. నాయర్ చివరి క్షణాలలో పడిన నరక యాతన అతని మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నాయర్ శరీరాన్ని అక్కడే గుంట తీసి పాతిపెట్టారు. తిరిగి వస్తుండగా క్రిస్టినాకి సడెన్గా ఏదో గుర్తుకు వచినట్టు ఆగిపోయింది.అందరు తన వంక విచిత్రంగా చూసారు. "వెయిట్. నాయర్ గుహలోకి వెళ్తున్నప్పుడు చావలేదు. గుహలోంచి వస్తున్నప్పుడు చనిపోయాడు. గుహలో అంత సేపు ఉన్నాక ఊపిరి ఆడక పోవడం అన్న మాటే లేదు. పైగా ఈ గుహలోకి గాలి ఉధృతంగా వస్తోంది. సో నాయర్ సహజంగా మరణించలేదు." అంది. ఆ మాటలు వినగానే అప్రయత్నంగా అందరు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. క్రిస్టినా చెప్పింది కరెక్ట్. నాయర్ శవం పది ఉన్న భంగిమ చూస్తె నాయర్ గుహలోంచి బయటకి వస్తున్నట్టుగ ఉంది. చిత్తడి నెల కావడంతో, నాయర్ అడుగు జాడలు ఇంకా ఉన్నాయి. వాటిని అనుసరించి చూడగా అవి అంతకు ముందు వీళ్ళు వెళ్ళిన పగులుని దాటి ఇంకా ముందుకు వెళ్తున్నాయి. లీ, గ్రెగ్ వెళ్దామా వద్ద అన్నట్టుగా మిగిలిన వారి వంక చూసారు.ఎవ్వరు ఏమి మాట్లాడక పోయేటప్పటికి ముందుకు కదిలారు. అలా గుహలో ఒక ఫర్లాంగ్ వెళ్ళేటప్పటికి గుహ రెండు మార్గాలుగా చీలిపోయింది. చీకటి వల్ల అడుగులు కనిపించట్లేదు. అందరు కలిసి కుడి వైపు కి వెళ్లారు. ఇంకొంచెం ముందుకి వెళ్ళాక. ఇంతకూ ముందు లాంటివే మరికొన్ని గదులు ఉన్నాయి. కాకపోతే ఇవి కొంచెం పెద్దగ ఉన్నాయి. ఒక గదిలో అర్ధచంద్రాకరం లో రాళ్ళు ఉన్నాయి. వాటి మధ్య ఒక పెద్ద రాయి ఉంది. వాటిని చూసి వివేక్ భ్రుకుటిముడిపడింది. అంతకు ముందు వివేక్కి ఉన్న నాలెడ్జ్ ప్రకారం, పసిఫిక్ సముద్రం లో వెల్లివిరిసిన నాగరికతలలో మాయ నాగరికత విశిష్టమైనది. మిగలిన నాగరికతలు అన్ని కొంత కాలానికి అంతరించిపోయి మరో నాగరికత పుట్టుకొచ్చింది. కాని మాయ నాగరికత క్రీ. పూ.2500 నించి విలసిల్లుతూనే ఉంది. సుమారుగా నాగరిక మధ్య కాలం దాక అంటే 800 ఉంది. అందువల్ల నేటి విజ్ఞానానికి అతి చేరువగా ఉండేది మాయ నాగరికత. దాని గురించి ఎన్నో పరిశోధనలు చేసారు. కావలసినంత స్టడీ మెటిరియల్ ఉంది. ఆ గదిలో ఉన్న రాళ్ళని చూడగానే అదొక వధ్యసాల అని వివేక్, ఆలేఖ్య గ్రహించారు. మాయ నాగరికత మిగిలిన నాగరికతల లాగే ప్రకృతిని ఉపాసించేది. మాయ నాగరికత సూర్యుడిని, వాన దేవుడిని ఉపాసించేవి. సూర్యుడు వీళ్ళు ఉండే ప్రాంతం మీదనించి ఆరు నెలలకి ఒక సారి పయనించేవాడు. దాన్నే ఇంగ్లిష్లో జేనియాల్ పస్సాజ్ అంటారు. ఆ సమయంలో మతపెద్దలు ఎన్నోనరబలులు ఇచేవారు. ఆ బలి చేయడం కూడా పరమ హేయంగా ఉండేది.మంచి వయసులో ఉన్న కన్యని రెండు రోజులు వివిధ పూజలు చేయించి, తరవాత మతపెద్దకి అంకితం ఇచేవారు. మరునాడు, సరిగ్గా సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో, ఆ యువతిని వివస్త్రని చేసి, కాళ్ళు చేతులు కట్టేసి, ఒక దిమ్మ మీద పడుకోబెట్టి గుండెలు కోసి సూర్యుడికి బలి ఇచేవారు. అది చాల హృదయ విదారకమైన తతంగం. ఇప్పుడు వీళ్ళ బృందం ఉన్నది కూడా అలంటి దిమ్మ దగ్గరే. ఈ విషయాలు చెప్పగానే అందరికి కొద్దిగా భయం, కొంచెం ఇంట్రెస్ట్ పుట్టుకోచాయి. వివేక్, ఆలేఖ్య కి కూడా చాల ఎగ్జియిటింగ్ గ ఉంది. ఎప్పుడు డైరెక్ట్ ఎక్స్కవషన్ లో పాల్గొనలేదు. కేవలం శిలా శాసనాలు చదవడం వాటిని అనువదించడమే పని. అప్పటికే వీళ్ళు లోపలి వెళ్లి చాలా సేపు అవ్వడంతో, తిరిగి వెనక్కి బయలుదేరారు.
బయటికి వచ్చాక, అందరు పళ్ళు తెచుకుని, మంట వేసుకుని మాట్లాడడం మొదలుపెట్టారు. జేమ్స్ "అసలు నాయర్ మనం అందరం పడుకున్నాక గుహలోకి ఎందుకు వెళ్ళినట్టు? " . "ఒక వేళ బంగారం కోసం వెళ్ళేడెమో " అన్నాడు గ్రెగ్. వివేక్ సాలోచనగా "అయ్యుండొచ్చు. కాని బంగారం తను ఎక్కడికి తీసుకుని వెడతాడు? వెళ్తే అందరం కలిసే వెళ్ళాలి. అది కూడా మనల్ని ఎవరన్న కాపాడడానికి వస్తే సంగతి. ఈలోపు బంగారం దాచి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే మనం ఎక్కడున్నామో మనకే తెలిదు. ఒక వేళ రేస్క్యు టీం వచినా, మనల్ని తీసుకుని వెళ్తారా లేదా అన్నది డౌటే. ఒక వేళ బంగారం కోసమే వెళ్ళాడు అనుకున్న, నాయర్ బంగారం కోసం వెళ్లుంటే, బంగారం ఉన్న చోటు నించి ఇంకా ముందుకి ఎందుకు వెళ్ళడం? నాయర్ అడుగులు కూడా బంగారం గదిలోకి వెళ్ళినట్టు లేవు. డైరెక్ట్ గ బంగారం ఉన్నచోటు దాటి ముందుకి వెళ్ళాడు."
"నిన్న రాత్రి నేను బంగారు గుండ్లని పరిక్షిస్తుంటే నన్ను పడుకోమన్నాడు. పొద్దున్న లేచాక చూద్దాం అనుకున్నాను. నాయర్ మిస్ అయిన హడావిడిలో ఆ సంగతి పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ బంగారం ముద్ద కనిపించట్లేదు. దానితో పాటు నాయర్ దగ్గర ఇంకో బంగారు గుండు కూడా ఉండాలి. అది కూడా కనిపించట్లేదు." అంది ఆలేఖ్య. "దట్స్ సస్పిషియస్! మన దగ్గర ఉన్న బంగారం మాయం అయింది. నాయర్ శవం మనకి గుహలోపల దొరికింది....." అంటూ మధ్యలో ఏదో ఆలోచన తట్టినట్టు ఆపేసాడు లీ. లేచి నాయర్ పడుకున్న చోట వెతికాడు. అక్కడ నేల మీద ఏవో గీతలు రాసి ఉన్నాయి. ఆలేఖ్య వివేక్ వాటిని చూసి, "ఇవి బహుశ ఆ బంగారం గుండ్ల మీద ఉండి ఉంటాయి. వాటిని ఇక్కడ మట్టి మీద నోట్ చేసుకున్నాడు".
ఆలేఖ్య ఆ గీతలమీదకి ఒంగి "ఇదేదో శాసనంలా ఉంది. దీని ప్రకారం ఈ బంగారం అంతా తియోథిహువాకాన్ అనే రాజ్యన్ని పాలించే కుల్ ఆహువా కి చెందినది. దీన్ని అను నిత్యం రాజు అంతరంగిక సేవకులు కాపాడుతూ ఉంటారు. ఈ బంగారాన్ని తాకినా, హస్తగతం చేసుకోవాలని అనుకున్నా, వారిని రాజు అంతరంగిక సేవకులు సంహరిస్తారు. ఈ బంగారం కేవలం వర్తకానికి మాత్రమె సింహాసనాన్ని అధిరోహించిన వారికి సొంతం." అని ఉంది. కుల్ ఆహువా అంటే మాయ నాగరికతలో రాజు అని అర్థం. అంటే బంగారపు ముద్దలు ఉన్న గది రాజు కోశాగారం అన్నమాట. అంటే ఈ శాసనం చదివి బంగారం అక్కడ తిరిగి పెట్టేయడానికి వెళ్ళాడా నాయర్? అక్కడ పెట్టి వస్తుంటే ఏదో తన దృష్టిని ఆకర్షించి ఉంటుంది. అందుకని కోశాగారం దాటి ముందుకి వెళ్ళాడు. కాని అక్కడినించి తిరిగి వచేటప్పుడు ఏదో అయ్యింది. ఒక వేళ అది నాచురల్ డెత్ అయ్యుంటే, ఆరోజు పొద్దున్న అయిదుగురు వెళ్లారు గుహ లోపలి. ఆక్సిజెన్ సరిపోక అయిన మరణం కాదది. some mystery is there which should be unveiled.

No comments:

Post a Comment