Pages

Saturday, January 30, 2010

అసుర సంధ్య పార్ట్ - 6

క్రిస్టినాతో వీళ్ళు ఇలా మాట్లాడుతుండగా, లీ చుట్టూ జాగ్రత్తగా గమనిస్తున్నాడు. కొంచెం సేపటికి ఎటువంటి ప్రమాదం లేదు అని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా విగ్రహం ఉండవలసిన చోటికి వచ్చి వెతకసాగాడు. గ్రెగ్ కదిపిన రాయి తేలికగానే గుర్తుపట్టాడు. దాని పక్కనే ఏదో శాసనం లాంటిది కనిపించింది. అది తీసుకుని మిగలిన వాళ్ళ దగ్గరికి వచ్చి, “ఇక్కడ ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదు. పదండి వెళ్లి పోదాం.” అన్నాడు. అందరు కలిసి బయటికి వచ్చేసారు. వస్తు వస్తూ, లీ, వివేక్ కొన్ని బంగారు గుండ్లు తీసుకు వచ్చారు. వాటి వంక చూస్తున్న జేమ్స్ తో “మనం అనుభవించిన దానికి ఎంతో కొంత ప్రతిఫలం తీసుకుని వెళ్దాం” అన్నాడు వివేక్. అందరు కలిసి గ్రెగ్ అంతకు ముందు దాచిన స్పీడ్ బోటు దగ్గరికి వచ్చారు. కొంతసేపట్లోనే సముద్రపు అలల మీదుగా దగ్గరలోని తీరానికి బయలుదేరారు.
*********
కొంత సేపటికి అమెరికా మరైన్స్ కి చెందిన ఒక బోటు కనిపించింది. వీళ్ళని తమ బోటు లోకి ఎక్కించుకొని మియామి వైపు బయలుదేరాయి. తరవాత కొన్ని రోజులు వీళ్ళకి చాల హడావిడిగ గడిచిపోయాయి. అమెరికన్ ఆర్మీ, నావి కలిసి వీళ్ళు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం ఆ గుహని స్వాధీనం చేసుకున్నాయి. అక్కడ గ్రెగ్ శవం తప్ప ఇంకేమి దొరకలేదు. నాయర్ బాడీ ని ఇండియా కి పంపించేసారు. ఇంటర్ పోల్ కి గ్రెగ్ ఆనవాళ్ళు పంపించారు. వాళ్ళకి కావాల్సిన వ్యక్తీ గ్రెగ్ అని నిర్ధారించుకుని గ్రెగ్ ఫైల్ క్లోజ్ చేసేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అర్కియాలజిస్ట్లు అందరు ఆ ద్వీపానికి బయలుదేరారు. అక్కడ ఉన్న బంగారాన్ని అమెరికన్ ప్రభుత్వం స్వాధీనం పరుచుకుని, క్రిస్టిన, లీ, జేమ్స్, స్వదేశాలకి , ఇండియా కి వాటాలు పంచింది. వివేక్ ఆలేఖ్య పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. కొన్ని వారల పటు, వివేక్ ఆలేఖ్య అర్కేయలజి సేమినర్స్ ఇవ్వడంలో మునిగిపోయారు.

ఆరు నెలల తరవాత..........
వివేక్ ఆలేఖ్య కొంచెం తీరికగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో వివేక్ ఏదో గుర్తుకు వచినట్టు లేచి హడావిడిగా లోపలి వెళ్లి వెతకడం మొదలు పెట్టాడు. తనకి కావాల్సిన వస్తువు దొరికాక బయటికి వచ్చాడు. గుహలోంచి బయటికి వచ్చేటప్పుడు లీ తీసుకుని వచ్చిన శాసనం. వివేక్ ఆలేఖ్య దాని సంగతే మర్చిపోయారు. ఇద్దరు కూర్చుని చదవడం మొదలుపెట్టారు.


*********
క్రీస్తు శకం 700 మొదట్లో మాయ నాగరికత ఉచ్ఛ స్థితి లో ఉంది. యిక్’ఇన్ చన్ కే’అవియిల్ అనే రాజు తికల్ అనే రాజ్యాన్ని పాలించేవాడు. అతను పరాక్రమవంతుడు. అతని పాలనలోనే తికల్ రాజ్యం పెద్ద విపణిగ మారింది. సుదూర ప్రాంతాల నించి వర్తకులు తికల్ నగరానికి వచ్చి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించేవారు. టోతిహుఅకాన్ (నేటి మెక్సికో దేశం లోని మెక్సికన్ వ్యాలి ) నించి కూడా వచ్చి వ్యాపారం చేసుకునేవాళ్ళు. కే’అవియిల్ పాలనలోనే తికల్ తన పొరుగున ఉన్న కాలక్ముల్ అనే రాజ్యాన్ని దాని మరో రెండు అనుబంధ రాజ్యాలని జయించింది. ఆ విజయానికి గుర్తుగానే యిక్’ఇన్ చన్ కే’అవియిల్ తికల్ పొలిమేరల్లో పెద్ద విజయ స్తూపం స్థాపించాడు. కలక్ముల్ రాజు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతని గురించి వెతికించి, అధరాలు దొరకక చనిపోయినట్టు ప్రకటించాడు. కొన్నాళ్ళకి అతని గురించి మర్చిపోయాడు. కానీ కలక్ముల్ని కోల్పోయిన యుక్నూం ఉత్తినే కూర్చోలేదు. ఎలాగో తప్పించుకుని ఈ ద్వీపానికి చేరుకున్నాడు. అక్కడి మంత్రికుడిని ఒప్పించి ఎన్నో క్షుద్ర శక్తులని తయారుచేయించాడు. ఒక రోజున ఆ క్షుద్రశాక్తులన్నితిని తికల్ రాజ్యం మీదకి ఉసిగొల్పాడు. ఆ రోజుతో తికల్ రాజ్యం అంతర్ధానం అయిపొయింది. తిరిగి వచ్చిన క్షుద్రశాక్తులని మాంత్రికుడు నిద్రాణపరిచి వాటిని నిబిరు అనే గ్రహం మీద నిక్షిప్తం చేసాడు. వాటిని తిరిగి మేల్కొపితే కేవలం అతని మాటకే కట్టుబడి ఉంటాయి. వాటిని తిరిగి రప్పించటానికి వీలుగా, ఇక్కడ ఒక క్షుద్రజీవిని తాయారు చేసాడు. ఈ క్షుద్రజీవి నిబిరు గ్రహం మీద ఉన్న మిగిలిన క్షుద్ర శక్తులని భూమికి రాప్పించాగలదు.
********
చదవడం అయిపోయాక వివేక్, ఆలేఖ్య మొహాలు చూసుకున్నారు. మాయ క్యాలెండర్ ప్రకారం 2012 భూమికి ఏదో పెద్ద ఉపద్రవం వస్తుంది అని ఉంది. ఆ విషయం మీద ఎన్నో పుకార్లు, సినిమాలు వచ్చాయి. అవి అన్ని కేవలం అభూత కల్పనలు అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇన్ని రోజులు వివేక్ ఆలేఖ్య కూడా అలానే అనుకున్నారు. ఉపద్రవం వస్తుంది అని మాయ శాసనాలు చాల వాటిలో ఉంది కానీ ఏ రూపంలో వస్తుందో ఎక్కడ సరిగ్గా చెప్పలేదు. ఆలేఖ్య భయంగ “వివేక్! అయితే మనం ఆ ఉపద్రవాన్ని ట్రిగ్గర్ చేసామ?” అని అడిగింది. దానికి సమాధానంగా ప్రకృతి వెంటనే స్పందించింది. ఉన్నట్టుండి ఆకాశం మేఘవ్రుతమయిపోయింది. ఒక పెద్ద పిడుగు వీళ్ళు ఉన్న చోటికి కొంత దూరంలోని ఒక చెట్టు మీద పడింది. మరుక్షణం అక్కడ ఒక బూడిద కుప్ప తప్ప ఇంకేమి మిగలలేదు. ఆలేఖ్య కి ఆరు నెలల ముందు లండన్ నించి చికాగో ఫ్లైట్ లో తనకి వచ్చిన కల గుర్తుకువచింది.
-X-X-X-X-X-X-X-