Pages

Wednesday, October 13, 2010

మాయ - 2

ఈ-మెయిల్ చెక్ చేస్తున్న శశాంక్ పెదవులమీద చిన్న చిరునవ్వు మెరిసింది. ఈ రిపోర్ట్ గురించే తను ఇన్ని రోజులు శ్రమ పడింది. మనిషి మేధస్సుని కంప్యుటర్ కి అనుసంధానించే ఇంటర్ఫేస్ కి తను గత ఆరు నెలలుగా కష్టపడి తయారుచేసిన ఆపరేటింగ్ సిస్టం టెస్ట్ రిజల్ట్స్ అవి. మొత్తం ప్రాజెక్ట్ కి ఎంతో కీలకమైన అపెరేటింగ్ సిస్టం “మాయ” తయారయింది. ఇంకా మిగిలినదల్ల హార్డువేర్ తాయారు చేసి దాన్ని వాడడమే. ఇంతలో ఎవరో డోర్ నాక్ చేసిన శబ్దం అవ్వడం తో శశాంక్ తను చూస్తున్న ఈ-మెయిల్స్ ని వెంటనే క్లోజ్ చేసి లాప్ టాప్ ని లాక్ చేసి
“Who is it?” అని అడిగాడు. బాయ్ వచ్చి కాఫీ సర్వ్ చేసి వెళ్ళిపోయాడు. కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అవుదమనుకుంటూ ఉండగా హోటల్ రిసెప్షన్ నించి ఫోన్ వచ్చింది. కింద తన కోసం కార్ వెయిట్ చేస్తోందని. అప్పుడు గాని గుర్తురాలేదు శశాంక్ కి ముందు రోజు Dr. సులేమాన్ ని కలుద్దామని తీసుకున్న అప్పాయింట్మెంట్. Dr. సులేమాన్ ఇరాన్ లో ఎంతో పేరు గాంచిన వ్యక్తీ. “Robotics and Aritificial Intelligence” మీద కొన్ని దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తున్నాడు. అతనికి ఇరాన్ మిలిటరీ కి కొన్ని సంబంధాలు ఉన్నాయని పుకార్లు ఉన్నాయి. వాటి సంగతి పక్కన పెడితే, సులేమాన్ రోబోటిక్స్ లో ఉద్దండుడు. శశాంక్ కి తన “మాయ” గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని తీర్చుకుందామని సులేమాన్ దగ్గర అప్పాయింట్మెంట్ తీసుకున్నాడు. తన మతిమరుపుకి తననే తిట్టుకుంటూ హడావిడిగా బయలుదేరి కారులో కూర్చున్నాడు. శశాంక్ కూర్చున్న బి.ఎం.డబ్ల్యు. వంద మీటర్లు కూడా వెళ్లక ముందే ఒక నల్లటి కాడిలాక్ నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది. కాడిలాక్ ని నడుపుతున్న వ్యక్తీ ప్రొఫెషనల్ అనుకుంట. శశాంక్ కార కి తన కార కి మధ్య కనీసం నాలుగు బండ్లు ఉండేటట్టుగా జాగ్రత్త పడుతూ నడుపుతున్నాడు.
అరగంట తరవాత బోస్టన్ తీరంలో ఉన్న ఒక విల్ల ముందు ఆగింది. అక్కడ సెక్యూరిటీ క్లియరెన్స్ అయ్యాక బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ బి.ఎం.డబ్ల్యు ని లోపలి పంపాడు. ఆ రోడ్ కి అదే డెడ్ ఎండ్. కార లోంచి దిగగానే సులేమాన్ సాదరంగా ఎదురు వచ్చి శశాంక్ ని పొదివి పట్టుకున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటేల్లిజేన్స్ రంగంలో శశాంక్ సాధిస్తున్న పురోగతి సులేమాన్ కి తెలియనిది కాదు. అందుకే శశాంక్ అడిగిన వెంటనే తన బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి శశాంక్ ని కలిసాడు. సులేమాన్ ఉన్నది ఇరాన్ గవర్నమెంట్ కి చెందిన గెస్ట్ హౌస్. ఎంతో కట్టుదిట్టమైన భద్రత లో ఉంది. తన పౌరులని అమెరికా పంపేటప్పుడు ఇరాన్ ప్రభుత్వం ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. అందులోను సులేమాన్ వంటి సైంటిస్ట్ ని పంపడం ఇరాన్ ప్రభుత్వానికి ఎంతో రిస్క్ తో కూడుకున్న పని. అందుకే సులేమాన్ కి కట్టుదిట్టమైన భద్రతా కలిపించింది. పరస్పర అభినందనల తరువాత శశాంక్, సులేమాన్ ఇద్దరు విల్ల లోపలికి నడిచారు.
C.I.A. కి సంబంధించిన కాడిలాక్ రెండు నిమిషాల తరవాత నిశబ్దంగా వచ్చి బంగ్లకి కొంచెం దూరంలో ఆగింది. నల్లని అద్దాల వెనుక ఉన్న వ్యక్తీ ఎప్పటికప్పుడు బేస్ స్టేషన్ కి రిపోర్ట్ చేస్తున్నాడు. సులేమాన్ లాంటి వ్యక్తీ అమెరికాకి వచినప్పుడు ఎవరెవరిని కలుస్తున్నాడు ఎం చేస్తున్నాడు అన్న సంగతి కనిపెట్ట్టడానికి అమెరికా లాంటి దేశం ఎప్పుడు అలెర్ట్ గ ఉంటుంది.