Pages

Sunday, December 12, 2010

మాయ - 3

గంట సేపటి తరవాత శశాంక్ ని సాగనంపడానికి వచ్చిన సులేమాన్ సునిశిత దృష్టిలో పడనే పడింది C.I.A. ఏజెంట్స్ కూర్చున్న కాడిలాక్. చిన్న నవ్వు నవ్వుకుని శశాంక్ కార్ వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు. అరనిమిషం పాటు చూసి మళ్లి లోపలి వచ్చేసాడు. వస్తూ వస్తూనే వడివడిగా తన బెడ్ రూమ్లోకి వెళ్లి తలుపు వేసేశాడు. గదిలో ఎవ్వరు లేరు అని రూడీ చేసుకున్నాక గోడకున్న అద్దం దగ్గరికి నడిచాడు. ఏడడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు ఉన్న వన్ సైడ్ మిర్రర్ అది. సాధారణంగా వన్ సైడ్ మిర్రర్స్ ని చాల తేలికగా గుర్తు పట్తోచు. అద్దం మీద మన వేలు పెడితే ప్రతిబింబానికి వేలికి మధ్యలో గ్యాప్ ఉండదు. అదే సాధారణమైన అద్దం అయితే వేలికి ప్రతిబింబానికి కొంచెం గ్యాప్ ఉంటుంది. కానీ సులేమాన్ గదిలో ఉన్న అద్దం ప్రత్యేకంగా ఇరాన్ ఇంటలిజెన్స్ తాయారు చేసిన అద్దం. మాములు అద్దానికి దీనికి ఏమాత్రం తేడ లేకుండా చేసారు. సులేమాన్ అతి రహస్యంగా ఇంస్టాల్ చేసిన ఒక బటన్ నొక్కగానే అద్దం పక్కకి జరిగి వెనకాల ఉన్న గది ప్రత్యక్షం అయ్యింది. ఆ గదిలో ఒక అడ్వాన్స్డ్ ప్రొజెక్టర్, అత్యంత ఆధునికమైన కమ్యూనికేషన్ పానెల్ ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వం ఎంతో ఖర్చుపెట్టి తాయారు కమ్యూనికేషన్ పానెల్ అది. దానికున్న స్క్రామ్బ్లేర్స్ ని బ్రేక్ చెయ్యడం దాదాపు అసంభవం. అమెరికన్ శాటిలైట్లకి దొరక్కుండా డిజైన్ చెయ్యబడింది అది.
సులేమాన్ అది ఆన్ చేసి తన కోడ్ చెప్పగానే ఆటోమాటిక్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది.
“టైగర్ రిపోర్టింగ్ టు హోం.” అన్నాడు సులేమాన్.
“హోం రీడింగ్. ప్రొసీడ్ టైగర్”
“ఎ వెరీ ఇన్నోవేటివ్ అండ్ పొటెన్షియల్ వెపన్ ఇన్ ప్రొగ్రెస్స్ బై హైనాస్. కాంటాక్ట్ మేడ్. విల్ కీప్ రీడింగ్. ఓవర్ అండ్ అవుట్”
ఎంతో సంక్షిప్తంగా ఉన్న మెసేజ్ అది. శశాంక్ చేస్తున్న రేసేఅర్చ్ గురించి ఇరాన్ మిలిటరికి పంపించిన మెసేజ్. శశాంక్ చేస్తున్న రేసేఅర్చ్ గురించి సులేమాన్ కి మొత్తం డీటెయిల్స్ చెప్పకపోయినా శశాంక్ అడిగిన కొన్ని ప్రశ్నల ద్వార సులేమాన్ మొత్తం గ్రహించేసాడు. శశాంక్ ప్రశ్నలకి సమాధానం చెప్పినట్టే చెప్పి శశాంక్ తనతోటి రెగ్యులర్ టచ్ లో ఉండేలా కధని నడిపించాడు.