Pages

Tuesday, July 20, 2010

మాయ - 1

మాయ
2003 26th September...
“Learning provides thinking! Thinking provides knowledge! Knowledge makes you great!"
టి.వి లో వస్తున్న ప్రసంగాన్ని వింటున్న పదిహేనేళ్ళ శశాంక్ ని చూసి మురిసిపోయింది వాళ్ళ అమ్మ. నెల్లూరు దగ్గరలోని శ్రీహరి కోట దగ్గరలోని చిన్న పల్లెటూరులో అతి సాధారణమయిన కుటుంబం వాళ్లది. అటువంటి చిన్న పల్లెటూరి నించి ఐ. ఐ.టి. ఖరగ్పూర్ లో కేవలం పన్నెండేళ్ళ వయసులోనే సీట్ సాధించిన శశాంక్ ని చూసి మురిసిపోని వాళ్ళు ఉండరు. అవును. శశాంక్ కేవలం తొమ్మిదేళ్ళ వయసులో టెన్త్ పరిక్షలు రాసి నెల్లూరు లో టాప్ వచ్చాడు. మరో ఏడాదికి ఐ.ఐ.టి లో సీట్ వచ్చింది. అక్కడ కూడా విత్ స్పెషల్ రికమెండేషన్, నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్స్ కేవలం రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి అక్కడే మాస్టర్స్ చేస్తున్నాడు. నాసా ప్రతి ఏడాది నిర్వహించే యంగ్ మైండ్స్ ప్రోగ్రాం కి ఇండియా తరఫున పాల్గొన్నాడు. చిన్న తనం నించి శార్ ని దగ్గర నించి చూడడం తో Dr. A.P.J అబ్దుల్ కలాం గారు అంటే చెప్పలేని అభిమానం. ఆయనని స్ఫూర్తి గ తీసుకున్నాడు.
1
2015, January 1st
న్యూరల్ నెట్వర్క్ మీద M.I.T లో జరుగుతున్న కాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తున్న వాళ్ళలో అతి పిన్న వయస్కుడు, ఏకైక భారతీయుడు Dr. శశాంక్. కేవలం ఇరవయ్ సంవత్సరాల వయసులో M.I.T లో థిసిస్ సబ్మిట్ చేసి శశాంక్, డాక్టర్ శశాంక్ అయిపోయాడు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటేల్లిజేంస్ మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళలో ప్రముఖమైన వాళ్ళలో శశాంక్ ఒకడు.
కాన్ఫరెన్స్ అయిపోయిన వెంటనే తన హోటెల్ గదికి వచ్చేసాడు. వచ్చి రావడంతోనే తన టీం ఇండియా నించి పంపిన ఈ-మెయిల్స్ చెక్ చేసుకోవడంలో బిజీ అయిపోయాడు. అతను అతి రహస్యంగా చేస్తున్న రిసెర్చ్ రిపోర్ట్స్ అవి.
శశాంక్ చేస్తున్న రిసెర్చ్ కనక ఒక రూపు దాలిస్తే మనిషి బుద్ధి జీవి అన్న నానుడి సాకారం అవుతుంది.
కంప్యూటర్ మొదట కనిపెట్టినప్పుడు ఒక సారి ఒక పని మాత్రమె చేయ్యగాలిగేవి. నెమ్మదిగా వాటిని ఒకేసారి చాల పనులు చేసేతట్టుగా అభివృద్ధి పరిచారు. సూపర్ కంప్యూటర్స్ యొక్క స్పీడ్ కేవలం ఒక మిల్లి సెకండ్ లో దాని ప్రాసెసర్ ఎన్ని ఆపరేషన్స్ చెయ్యగలదు అన్నదాన్ని బట్టి నిర్ణయిస్తారు. శశాంక్ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ రూపొందించడానికి ఒక అప్ప్రోచ్ కనిపెట్టాడు. అదే మనిషి. ఒక మనిషి మెదడు ఒకే సమయంలో చాలా పనులు చెయ్యగలదు. సరిగ్గా ఉపయోగిస్తే మనిషి మెదడు ఒక విషయాన్నీ విశ్లేషించే సమయం అదే విషయాన్నీ ఒక కంప్యూటర్ విశ్లేషించ సమయం కన్నా తక్కువ పడుతుంది. ఇది ఎన్నో సార్లు చెస్ ప్లేయర్స్ విషయంలో నిరూపించా బడింది. ఈ విశ్లేషణ శక్తిని సూపర్ కంప్యూటర్ తో అనుసంధానం చేస్తే ఒక మైక్రో ప్రాసెసర్ చేసే పనిని మనుషులే అతి తేలికగా చేయ్యగాలుగుతారు. ఇప్పుడు సైబర్ సెంటర్స్ ఉన్నట్లు కంప్యూటింగ్ సెంటర్స్ ని దేశ వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేస్తే చదువు సంధ్యలతో పనిలేకుండా ప్రతి మనిషి తన సమయాన్ని కేటాయించి సూపర్ కంప్యూటింగ్ క్లౌడ్ కి కనెక్ట్ అయితే చాలు. శశాంక్ అప్ప్రోచ్ లో ఉన్న లాభం ఏమిటంటే, మనిషికి స్వతహాగా తెలివి తేటలు ఉన్నాయి కనక, మొదటి సరి వచ్చిన వ్యక్తీ విశ్లేషణ శక్తి కన్నా రెండో సరి, మూడో సరి వచ్చే వ్యక్తీ విశ్లేషణ శక్తి ఎక్కువ ఉంటుంది. దీని వాళ్ళ కంప్యూటింగ్ స్పీడ్ పెరగడమే కాకుండా సామాజికంగా ప్రతి వ్యక్తీ విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. దీని వల్ల వ్యక్తిగతంగా, ఆర్ధికంగా దేశానికి ఎంతో ఉపయోగం. ప్రతి మనిషి మేధావి అవుతాడు. ఇప్పుడు భారత దేశం ఎదురుకుంటున్న మేధో వలస ఉండదు. మొత్తం ప్రపంచానికి ఇండియా విల్ బికం ఎ సెంటర్ అఫ్ ఇంటలిజెన్స్. శశాంక్ చేస్తున్న రిసెర్చ్ అంతా మనిషి మేధో శక్తి ని ఒక సూపర్ కంప్యూటర్ తో అనుసంధానిచే ప్రోసెస్ మీద. అది కూడా కార్య రూపం దాల్చే రోజు ఎంతో దూరం లో లేదు. మరొక రెండేళ్లలో ప్రపంచ పటం మీద భారత దేశ ముఖ చిత్రం మార్చాలన్నది శశాంక్ ఆశయం. ఈ రిసెర్చ్ అంతా ఢిల్లీ అవుట్ స్కర్త్స్లోని ఒక రహస్య ప్రదేశంలో జరుగుతోంది. ఈ రిసెర్చ్ గురించి తెలిసింది కేవలం నలుగురు వ్యక్తులకే. శశాంక్ , ప్రొఫెసర్ చక్రపాణి, ఆర్మీ చీఫ్ జనరల్ కరియప్ప అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (IIAC) చైర్మన్ డాక్టర్. షణ్ముగం. వీళ్ళు నలుగురు ప్రతి నెల అతి రహస్యంగా కలుసుకుని రిసెర్చ్ ప్రొగ్రెస్స్ ని అనలైజ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కి పెట్టుకున్న కోడ్ నేమ్ “మాయ“