Pages

Sunday, December 6, 2009

అసుర సంధ్య - 4

ఆ ఆలోచనలతోటే ఆ రాత్రి గడిచిపోయింది. ఎవ్వరికి నిద్ర సరిగ్గా పట్టలేదు. పొద్దున్న అవుతూనే, వివేక్ ఆలేఖ్య ఇద్దరు గుహలోకి బయలుదేరారు. తమతో పాటు వచ్చిన నాయర్ చనిపోవడం ఇద్దరు చాల సీరియస్ గా తీసుకున్నారు. ఎత్తి పరిస్థితులలోను నాయర్ చావుకి కారణం తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. వీళ్ళు ఇద్దరు గుహలోపలికి వెళ్తుంటే గ్రెగ్ అభ్యంతరం చెప్పాడు. "నిన్ననే నాయర్ని కోల్పోయాం. మళ్ళి మీ ఇద్దరినీ కూడా కోల్పోదల్చుకోలేదు. లోపల నాయర్ ఎందుకు అటు వెళ్ళాడో, ఎందుకు చంపబడ్డాడో మనం తెలుసుకోకుండా మళ్ళి ఆ గుహలోకి వెళ్ళడం అంత మంచిది కాదు." "మేము బంగారం కోసమే ఆ గుహలోకి వెళ్తున్నమనుకుంటే మీరు పొరబడ్డారు. మీకు నాయర్ నాలుగు రోజుల నించి తెలుసు. కాని మాకు ఇద్దరికీ ఆయన నాలుగు సంవత్సరాలుగా తెలుసు. మీకు ఆ గుహలో బంగారం మాత్రమే కనిపిస్తుంది. కాని మా ఇద్దరికీ నాయర్ చావుకి కారణం కనిపిస్తోంది. దానికి మించి మాయా నాగరికత గురించిన విలువయిన సమాచారం ఉంది. మీరు ఒక డాక్టర్.ఒక పేషెంట్ చావు బతుకుల మధ్య ఉంటె చూస్తూ మీరు ఎలా ఊరుకోలేరో ఒక ఆర్కియాలోజికల్ సైట్ ని గాలికి వదిలి మేము ఇద్దరం ఉండలేము. ఇది మా వ్రుత్తి. దానికి మించి మా గురువులాంటి వ్యక్తీ చావుకి కారణం తెలుసుకోవడం మా బాధ్యత" ఆవేశం గ అంది ఆలేఖ్య. తన మాటలు విని జేమ్స్ కూడా వాళ్ళనే సపోర్ట్ చేసాడు. గ్రెగ్, క్రిస్టినా తప్ప అందరు మిగిలిన వాళ్ళు అందరు గుహ లోకి వెళ్లారు. "హౌ ఫూలిష్? చనిపోయిన వ్యక్తి కోసం వీళ్ళ ప్రాణాలు రిస్క్ లో పడేసుకుంటున్నారు. ఒక్క సారి ఈ దీవి లోంచి బయటపడని. నేను ఈ దివికి సేపెరేట్ గ వచ్చి ఈ బంగారాన్ని అంత తీసుకుపోతాను. నువ్వు నేను జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు." అంటు క్రిస్టినా ని కౌగిలిన్చుకున్నాడు. గుహ లోకి వెళ్ళిన లీ, జేమ్స్, వివేక్, ఆలేఖ్య బృందం, వధ్యశాల దాటి ఇంకా ముందుకు వెళ్లారు. వాళ్ళు గుహ లోపలి ఒకట్రెండు కిలోమీటర్లు నడిచి ఉంటారు. అంత దూరం నడిచినా, వాళ్ళకి ఇంకా గుహ అవతలి భాగం కనిపించట్లేదు. కొంచెం ముందుకి వెళ్ళేటప్పటికి గుహ నెలకి సమాంతరంగా కాకుండా నేల లోపలి దిగడం ప్రారంభించింది. వాళ్లకి కుడి వైపున రెండు పెద్ద మందిరాలు కనిపించాయి. ఇన్నాళ్ళు వాళ్ళు ఆ గుహ సహజంగా ఏర్పడిందేమో అనుకున్నారు. కానీ గుహ అంత ఒక పధ్ధతి ప్రకారం కొండని తోలిచినట్టుగా ఉంది. ఆ మందిరం గోడల నిండా రకరకాల బొమ్మలు, మాయ లిపిలో ఏవో శాసనాలు రాసి ఉన్నాయి. వివేక్, ఆలేఖ్య ఆ శాసనాలు చదవడం మొదలు పెట్టారు. వాళ్ళకి అది చాల తేలికగా అనిపించింది. మాయ నాగరికత మిగలిన నాగరికతలకన్న ప్రపంచానికి ఎక్కువ తెలుసు. ఆ శాసనాలు చదువుతున్న కొద్ది వాళ్ళ మొహం లో రంగులు మారడం మొదలయ్యింది. ఆ శాసనం ప్రకారం, ఆ దీవి ఒక క్షుద్రోపాసకుడి ఆధీనంలో ఉండేది. మాయ నాగరికత టైం లో ప్రజలు చిన్న చిన్న గుంపులు గ ఉండేవారు. ఒక తెగకి ఇంకో తెగకి పడేది కాదు. ఆధిపత్య పోరు చాల భీకరంగా ఉండేది. ఒక రాజ్యపు సైన్యం మరో రాజ్యపు ప్రజలని దారుణంగా ఊచకోతకోసి, వారి సంపదనంతా దోచుకునే వారు. శత్రువుల నించి రాజ్యాన్ని రాజ్యపు సంపదని కాపాడుకోవడానికి రాజులు ఈ మాంత్రికుడి దగ్గర తమ సంపదనంతా దాచి ఉంచారు. ఈ మాంత్రికుడు అత్యంత శక్తి యుక్తులు కల వాడు. ఇతని ఆధీనంలో ఎన్నో క్షుద్ర శక్తులు ఉండేవి. ఆ క్షుద్ర శక్తుల సాయంతో ఆ దీవిని ఆ మాంత్రికుడు కాపాడుకునే వాడు. వీరి సంపదని కాపాడుతున్నందుకు ప్రతిగా మంత్రికుడికి కావాల్సిన అన్ని అవసరాలు తీర్చేవాళ్ళు మాయ రాజులు. మాంత్రికుడి ప్రయోగాలకి కావాల్సిన వస్తువులు, జంతువులు, మనుషులు అన్ని సమకూర్చేవారు. ఇప్పుడు వీళ్ళు నిలబడ్డ మందిరం, ఆ మాంత్రికుడి ప్రయోగ శాల. ఇది చదవగానే బంగారం, ఇతర విలువయిన వస్తువులు ముందు గదుల్లో అన్ని రాసులుగా ఎందుకున్నాయో అర్థం అయ్యింది. అప్పట్లోనే ఇలాంటి విధానం ఉందా అని ఆశ్చర్య పోయారు. నేటి ఆధునిక యుగంలో ప్రతి దేశం తన దగ్గర ఉన్న బంగారాన్ని ఒక చోట దాచి పెడుతుంది. ఆ నిల్వల్ని బట్టి ఆ దేశ పురోగతి ఆధార పడి ఉంటుంది. ప్రపచంలో అత్యంత ఆకర్షకరమైన దేశం అమెరికా తన బంగారు నిల్వల్ని ఫోర్ట్ నోక్స్ లో దాచి పెడుతుంది. ప్రతి దేశపు మారక విలువ ఆ దేశం వద్ద ఉన్న బంగారు నిల్వల్ని బట్టి నిర్ణయిస్తారు. ఆ శాసనాన్ని బట్టి ఈ దీవికి సమీపం లో మరిన్ని దీవులు కాని, దగ్గరలోనే నేల గాని ఉండి తీరాలి.

సముద్రంలో అలలతో పోటిపడుతూ ఒక మధ్య రకం స్పీడ్ బోటు వేగంగా దూసుకుపోతోంది. అది యు.ఎస్ నావికాదళానికి చెందినది. సరిహద్దు పహారా కాయడం దాని ప్రధాన కర్తవ్యమ్. నాలుగు రోజులనించి సముద్రం లో కూలిన శకలాల కోసం వెతుకుతున్నారు. అప్పటికే విమానం కూలి వారం దాటిపోయింది. విమానం ఎక్కడ మిస్ అయ్యిందో తెలీకపోవడం,వాతావరణం అనుకూలించకపోవడంతో శకలాల వెలికితీత చాల ఆలస్యమయింది. విమానం కూలినప్పుడు తుఫాను తీవ్రంగా ఉండడం, విమానం కూలి వారం అవ్వడం వాళ్ళ, శకలాలు చాల పెద్ద విస్తీర్ణంలో చెల్లా చెదురుగా ఉన్నాయి. సముద్రం లో అంతర్వాహినులు ఉంటాయి. పైకి తెలియని ప్రవాహాలు అవి. వాటిలో చిక్కుకుంటే మీడియం సైజు పడవలు కంట్రోల్ తప్పుతాయి. ఒక్కోసారి నావికులు ఈ అంతర్వాహినుల గమనాన్ని బట్టి ఓడ డైరెక్షన్ మార్చి లాభ పడుతుంటారు. ఎంతో అనుభవం ఉన్నవాళ్ళకి తప్ప మామూలు కంటికి కనిపించవు.అలల తాకిడికి, తుఫాను భీభత్సానికి శకలాలు చెల్లా చెదురు అయిపోయాయి. ప్రయాణీకుల శవాలు సముద్ర ప్రాణులకి ఆహరం అయిపోయాయి. విమానం బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నారు. మొత్తం ఎనిమిది బృందాలు బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నాయి. ఎవరైనా బతికి ఉంటారన్న ఆశ లేదు. కనీసం శవాలు అయిన దొరుకుతాయేమో అని వెతుకుతున్నారు. ఇద్దరు సిబ్బంది ఉన్న బోటులో సముద్రంలో చాలా లోపలకి వచ్చారు. సముద్రాన్ని గ్రిడ్ కింద విభజించి రోజు కొంత ప్రాంతాన్ని వెతుకుతున్నారు. చీకటి పడేటప్పటికి వెతుకులాట ఆపేస్తున్నారు. వెతికి వెతికి సిబ్బందికి కూడా విసుగు పుట్టింది. చేసే పని మీద శ్రద్ధ తగ్గింది. ఆటవిడుపుకోసం చేపల వేట మొదలుపెట్టారు. అలా అలా వెతుకుతూ ఉండగా దూరంగా వాళ్ళకి ఒక దీవి కనిపించిది. వాళ్ళదగ్గర ఉన్న మాప్ ప్రకారం అక్కడ ఎటువంటి దీవి లేదు. ఆ దీవిని చూడగానే బోటు నడుపుతున్న జో ఆశ్చర్యం తో విజిల్ వేసాడు. దీవి కనిపించిన సంగతి బేస్ స్టేషన్ కి రిపోర్ట్ చేద్దాం అని వైర్లెస్ సెట్ ఆన్ చేసాడు. గరగర శబ్దం తప్ప సిగ్నల్ రాలేదు. అక్కడ శాటిలైట్ కవరేజ్ లేదు అని అర్థం అవ్వడానికి ఎక్కువ సేపు పట్టలేదు. బహుశ అందుకే ఈ దీవి కూడా మ్యాప్ లో లేదు ఏమో. నెమ్మదిగా దీవి దగ్గరికి పోనిచ్చాడు.
అందరు గుహ లోపలి వెళ్ళగానే క్రిస్టినా, గ్రెగ్ అడవిలో విహారానికి బయలుదేరారు. ఆలా తిరుగుతూ తిరుగుతూ సముద్రం దగ్గరగా వచ్చారు. నడుస్తున్నదల్ల ఉన్నట్టుండి ఆగిపోయింది. "గ్రెగ్ ! నీకు ఏదయినా శబ్దం వినిపిస్తోందా? " అప్పటికే గ్రెగ్ కూడా బోటు శబ్దం విన్నాడు. ఇద్దరు ఒకరి వంక ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యంగా ఆనందంగా శబ్దం వినిపిస్తున్న వైపు పరిగెత్తారు. ఇద్దరు సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి బోటు అప్పుడే ఆగింది. అందులోంచి ఇద్దరు వ్యక్తులు కిందకి దిగితున్నారు. పరుగెడుతున్న గ్రెగ్ క్రిస్టినా ని కూడా ఆపి ఇద్దరు ఒక పొద చాటున దాక్కున్నారు. "హే! ఎం చేస్తున్నావ్? ఎందుకు ఆపేసావ్? బోటు వచ్చింది కదా, అందులోకి అందరం ఎక్కి హ్యాపీగా ఎవరి ఇళ్ళకి వాళ్ళం వెళ్లిపోవచ్చు కదా. ఈ బంగారం కూడా ఎవరికీ కావలసినంత వాళ్ళం తీసుకుని మిగిలిన లైఫ్ అంతా ఏ లోటు లేకుండా గడపొచ్చు."
"పిచ్చిదానా! ఎవరికి కావలసినంత బంగారం వాళ్ళు కాదు, మనకి కావల్సినంత మనం మాత్రమే తీసుకుందాం. మిగిలిన వాళ్ళని ఈ దీవి మీద వదిలేసి మనం వెళ్లిపోదాం."
“మనం బంగారం తీసుకుని వెళ్తే వీళ్ళు వాటా అడుగుతారు కదా. వాళ్ళు మనల్ని ఎమన్నా చేస్తే? "
"వాళ్ళు బతికుంటే కదా మనల్ని ఎమన్నా చేసేది? “ అంటూ బట్టల చాటు నించి ఒక చిన్న కత్తి తీసాడు. అది విమానంలో సలాడ్స్ కట్ చేయడానికి వాడే కత్తి. ఒడ్డుకు కొట్టుకు వచ్చిన సామాన్లలో దొరికింది అది. ఎందుకన్నా పనికి వస్తుంది అని తీసి ఎవరికి కనిపించకుండా దాచి పెట్టాడు. కత్తి వంక కంగారుగా చూస్తూ
"ఎం చేయ్యబోతున్నావ్ దీనితో?" అంది క్రిస్టినా.
"వెయిట్ అండ్ సి" అంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ బోటు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే బోటు లోంచి దిగి ఇద్దరు తలో వైపు నడుస్తున్నారు. గ్రెగ్ నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరి వెనకగా వెళ్లి ఇద్దరి గొంతు అతి చాకచక్యంగా కోసేసాడు. గ్రెగ్ పనితనం చూసి క్రిస్టినాకి అనుమానం వచ్చింది. అప్పటి దాక ఏదో సరదాగా మాట్లాడుకోవడమే తప్ప గ్రెగ్ గురించి అసలు తనకి ఏమి తెలిదు అని గ్రహించింది. ఈలోపు గ్రెగ్ బోటు ని వడ్డుకి దగ్గరగా పొదల్లోకి లాగి ఆకులు కొమ్మలతో కప్పెసాడు. పడవ లాగిన జాడలు కనిపించకుండా ఇసకని సరిచేసాడు. అప్పటికే శవాలుగ మారిన ఇద్దరినీ సముద్రంలో చేపలకి ఆహారంగా పడేసాడు. గ్రెగ్ తిరిగి రాగానే క్రిస్టినా అడిగింది "ఎవరు నువ్వు?". గ్రెగ్ ఒక పెద్ద హిట్ మాన్. యూరోప్, అమెరికాలలో జరిగిన ఎన్నో రాజకీయ హత్యలు గ్రెగ్ చేతుల మీదుగా జరిగినవే. గ్రెగ్ ఎవరో ఏమిటో ఎవరికి తెలిదు. తనని చూసిన వాళ్ళెవరూ బతకలేదు. తనతో లావాదేవీలు అన్ని అప్పటికప్పుడు ఏర్పరుచుకునే సంకేతాల ద్వార, కోడ్స్ ద్వార జరుగుతాయి తప్ప డైరెక్ట్ గ జరగవు. తను చేసే హత్యలు అన్ని హై ప్రొఫైల్ హత్యలు అవ్వడం వల్ల ఎప్పుడు బహిరంగంగా తిరిగే అవకాసం రాలేదు. ఎలాగు ఈ ఫ్లైట్ క్రాష్ లో తను చనిపోయినట్టు ప్రచారం అయింది కనక ఒక వేళ తిరిగి వెనక్కి వెళ్ళడం అంటూ జరిగితే కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నాడు. క్రిస్టినా కూడా ఆ నిర్ణయానికి ఒక కారణం. అదంతా క్రిస్టినా కి చెప్పదల్చుకోలేదు.
"నా గతం తెలియడం వల్ల నీకు లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎప్పుడు దాని గురించి ఆలోచించకు. ఇక్కడ నించి ఈ రాత్రికే బయటపడి, కొత్త జీవితం మొదలుపెడదాం. చెప్పు ప్రపంచంలో నీకు ఎక్కడ సెటిల్ అవ్వాలని ఉంది? మనం అక్కడే మన కొత్త జీవితాన్ని మొదలు పెడదాం." అన్నాడు గ్రెగ్. "ఈ రాత్రికా? మరి వీళ్ళందరూ?"
"వీళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు.ఎంతన్న జేమ్స్ నన్ను కాపాడాడు. మనం మనకి కావల్సినంత బంగారం ఈ పడవలోకి చేరవేసి ఈ దీవి నించి తప్పించుకుందాం. వీళ్ళ అదృష్టం బావుంటే బయటపడతారు. లేక పొతే వీళ్ళ ఖర్మ. " అన్నాడు గ్రెగ్.
ఆ క్షణంలో గ్రెగ్ ని చూస్తె ఒక విదమైన భయం వేసింది క్రిస్టినా కి. కానీ అదే సమయంలో అతని మీద ప్రేమ ఆ భయాన్ని మింగేసింది.

No comments:

Post a Comment