"ఇలానే చలిలో ఉంటె రెస్కు టీం మనల్ని కనుక్కునే లోపు మనం చలి గాలికి చచ్చిపోతాం. మనం ఏదో ఒకటి ఆలోచించాలి" అన్నాడు గ్రెగ్. అది నిజమే.సముద్రపు గాలి అంత మంచిది కాదు. అప్పటికప్పుడు అంతా ఒక నిర్ణయానికి వచ్చారు. జేమ్స్, నాయర్, లీ, గ్రెగ్ దీవిలోకి వెళ్లి ఉండడానికి ఏదయినా చోటు ఉందేమో వెతికేటట్టు మిగిలిన వాళ్ళు ఒడ్డు దగ్గరే ఉండేటట్టు ఒప్పందం కుదిరింది. వెంటనే నలుగురు కలిసి దీవిలోకి బయలుదేరారు. పక్షుల కిల కిల రావాలు తప్ప దీవి నిశ్శబ్దంగా ఉంది. దీవి అంతా దట్టమైన చెట్లతో, విచిత్రమైన పొదలతో నిండి వుంది. అడుగు తీసి అడుగు వెయ్యడం చాల కష్టంగా ఉంది. అల అడవిలోకి నాలుగయిదు మైళ్ళు నడిచాక నాయర్ నీరసంగా ఉంది అంటూ ఒక చెట్టు పక్కన కూర్చుండి పోయాడు. నాయర్ కూడా ఆలేఖ్య వివేక వెళ్తున్న టీం లోని వాడే. వీళ్ళ టీం కి మేనేజర్. నలభయ్యో వడిలో పడుతున్నాడు. మిగిలిన వాళ్ళతో సమానం గ నడవలేక పోతున్నాడు. అందరు కూర్చున్నారు. కొంచెం సేపు అయ్యాక లీ అన్నాడు. "ఎంత దూరం నడిచిన ఏమి కనిపించట్లేదు. ఎవ్వరు ఉంటున్నట్లు లేదు ఈ దీవి." లీ చెట్టు ఎక్కి చూసాడు. చూసిన వాడు చూసినట్టు అలానే ఉండి పోయాడు. లీ ఎంత సేపటికి ఏమి మాట్లాడక పోవడం తో జేమ్స్ లీ ని పిలిచాడు. లీ గబగబా చెట్టు దిగి ఆశ్చర్యంతో
"కొంచెం ముందుకి వెళ్తే విశాలమైన మైదానం ఉంది. అక్కడ ఏవో కట్టడాలు ఉన్నాయి."
వెంటనే అందరికి ఉత్సాహం వచ్చి పరుగులాంటి నడకతో అక్కడికి వెళ్లారు. లీ చెప్పినట్టుగానే అక్కడ కొన్ని రాతి కట్టడాలు ఉన్నాయి. సుమారుగా శిధిలావస్థకు చేరుకున్నాయి. ఆర్కియాలజీ డిపార్టుమెంటు లో పదిహేను సంవత్సరాలు పనిచేసిన నాయర్ కి అవి పురాతన కాలానికి చెందినవని గ్రహించడానికి ఎక్కువ సేపు పట్టలేదు. అదే విషయాన్నీ అందరికి చెప్పాడు. ఆ రాతి కట్టడాలు అన్ని దట్టమైన చెట్ల మధ్యలో ఉన్నాయి. అక్కడే కొంత సేపు ఉండి వెనక్కు బయలుదేరుతుంటే ఒక రాతి కట్టడం వెనుకగా పెద్ద విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం ఏమిటా అని అంతా అటుగా వెళ్ళేటప్పటికి ఆ విగ్రహం పక్కనే పెద్ద గుహ కనిపించింది. అందులోకి వెళ్ళాలా వద్ద అని ఆలోచనలో పడ్డాడు జేమ్స్. అందరిని పిలిచి చూపించాడు. అప్పటికే వాళ్ళు ఒడ్డు నించి బయలుదేరి చాల సేపయ్యింది. తిరిగి వెళ్ళడమే మంచిది అని అనుకుని వెనక్కి తిరిగారు. చీకటి పడే దాక అక్కడ ఉండి, చీకటి పడే సమయానికి ఈ ప్రదేశానికి తిరిగి వద్దాం అనుకున్నారు. వెళ్ళే దారిలో కనిపించిన పళ్ళని కోసుకుంటూ వెళ్లారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఆలేఖ్య, వివేక్, క్రిస్టినా ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. క్రిస్టినా జర్మన్. అక్కడ జర్నలిస్ట్. తన ఫ్రెండ్ ని కలవడానికి అమెరికా వెళ్తోంది. పళ్ళతో వస్తున్నా వీళ్ళ నలుగురిని చూసి కబుర్లు ఆపారు. పళ్ళు తింటూ ఉండగా దీవిలో చూసిన రాతి కట్టడాల గురించి చెప్పాడు నాయర్. ఆలేఖ్య వివేక్ లు ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళు ఎంత సేపు వాళ్ళ స్టోర్ రూంలో ఉన్న వస్తువుల్ని స్టడీ చేయడం తప్ప ఎప్పుడు డైరెక్ట్ excavation లో డైరెక్ట్ గ పాల్గొనలేదు. పళ్ళు తినగానే ఒడ్డున ఉన్న సమన్లలో పనికి వచ్చే సామాను కలెక్ట్ చేసుకుని నెమ్మదిగా అడవిలోకి బయలుదేరారు. ఒక గంట నడిచేటప్పటికి అంతకుముందు వచ్చిన ప్రదేశానికి వచ్చారు. అందరు రంగంలోకి దిగి ఉండడానికి రెండు రాతి కట్టడాలు సిద్ధం చేసారు.
3
చీకటి పడ్డాక అందరు అక్కడ దొరికిన ఎండు కొమ్మలు అవి పేర్చి మంట వేసుకున్నారు. జంతువులకి నిప్పు అంటే భయం. నిప్పు ఉన్నంత సేపు ఆ దరిదాపులకి కూడా రావు. పొద్దున్న నించి బాగా కష్టపడడం వల్ల అందరికి వెంటనే నిద్ర పట్టేసింది. కొన్ని గంటలు గడిచాక ఏవో శబ్దాలు వినిపించి అందరికి మెలకువ వచ్చింది. "ఏంటి పగలంతా నిశబ్దంగా ఉన్న దీవి లో రాత్రి ఈ శబ్దాలు ఏంటి?" భయం భయంగ అడిగింది ఆలేఖ్య. అందరు కలిసి శబ్దం వస్తున్న వైపు నడవనారంభించారు. శబ్దాలు వీళ్ళు ఉన్న రాతి సముదాయాల వెనక నించి వస్తున్నాయి. అడుగులో అడుగు వేసుకుంటూ అంతా ఆ దిశగా నడుస్తున్నారు. లీ చేతికి దొరికిన కొమ్మనొక దాన్ని తీసుకున్నాడు. గ్రెగ్ మండుతున్న నెగడులొన్చి ఒక కర్రని తీసుకుని కాగడాలాగా పట్టుకున్నాడు. శబ్దాలు విగ్రహం వెనకనున్న గుహలోంచి వస్తున్నాయి. లోపలికి వెళ్ళాలా వద్ద అని అందరు అనుమానంగా ఒకరి వంక ఒకరు చూసుకుంటూ ఉన్నారు. లీ జేమ్స్, వివేక కొంచెం ధైర్యంగా ముందుకి వెళ్లారు. గుహ మొదట్లోకి వెళ్ళేటప్పటికి శబ్దాల తీవ్రత మరింత పెరిగింది. లీ వివేక్ జేమ్స్ తడబడుతూ గుహలో ప్రవేశించారు. గుహ చాల విశాలంగా ఉంది. ముఖ ద్వారం చిన్నదిగా ఉన్నా లోపల వంద అడుగుల వెడల్పు వంద అడుగుల ఎత్తులో చాలా విశాలంగా ఉంది. గుహ పై భాగం లో గబ్బిలాలు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయనడానికి గుర్తుగా గుహ కింద భాగమంతా వాటి రెట్టలతో చిత్తడి చిత్తడిగ ఉంది. ఆ చిత్తడి నేల గుహలో ఒక అర కిలోమీటరు ఉంది . గుహలోకి ఉద్ద్రుతమైన గాలి వస్తోంది. అది ఎక్కడి నించి వస్తోందో తెలిదు. బహుశ కొండకి అటువైపు నించి వస్తుంది ఏమో అనుకున్నారు. చేతిలో ఉన్న కాగడ ఎక్కువసేపు వెలగదు అని గ్రహించి మళ్లీ వెనుతిరగబొయారు. అలా తిరుగుతుండగా వారికి ఎడమ పక్కన గోడలో చిన్న పగులు కనిపించించింది. ఆ పగులులో ఏముందో చూడాలని అనిపించింది వివేక్కి . మర్నాడు చూద్దాములే అని సరిపుచుకున్నాడు వివేక్. అంతా బయటికి వచ్చేసరికి కాగడ ఆరిపోయింది. ఒక్కసారిగా అంతా లోపల నించి వచ్చే శబ్దాలు ఏంటి అని అడిగారు. ఆ శబ్దాలు గాలి వల్ల వస్తున్నాయి అని తెలిసాక అందరు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. వచ్చాక వివేక్, ఆలేఖ్య, క్రిస్టినా, గ్రెగ్ ఒక చోట, లీ, నాయర్, జేమ్స్ ఒక చోట పడుకున్నారు. రాత్రంతా ఒకరికి ఒకరు అంత దగ్గరగా పడుకోవడం వల్ల వివేక్, ఆలేఖ్య ఇద్దరు చాలా ఎగ్జయిట్ అయ్యారు. ఇద్దరికీ నిద్ర సరిగ్గా పట్టలేదు. తెల్లవారుతోంది అనగా వివేక్ లేచి ఇవతలకి వచ్చాడు. ఆ అలికిడికి ఆలేఖ్య కూడా మెలకువ వచ్చింది. వివేక్ వెనకాలే వచ్చి వివేక్ ని వెనకాల నించి వాటేసుకుంది. వివేక్ ఒక్క క్షణం ఉలిక్కి పడ్డా వెంటనే తమాయించుకొని వెనక్కి తిరిగాడు. "ఆలేఖ్య! ఏంటిది?" అని అడిగాడు. ఆలేఖ్య కొంటెగా వివేక్ వంక చూసి "నేను విమానంలో అడిగిన దానికినువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు" అంది. వివేక్కి తను అంటున్నది ఏమిటో లిప్తకాలం గుర్తురాలేదు. వచ్చిన తరవాత ఆనందం, సిగ్గు వల్ల మొహం ఎర్రగా కందిపోయింది. ఎంతోకాలంగా గుండెల్లో దాచుకున్న ప్రేమ ఉప్పెనలా వచ్చి నోటికి మాట పెగల్లేదు. ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకున్నారు. అన్నాళ్లుగా ఇద్దరికీ పరిచయం ఉన్నా ఎప్పుడు మనసు విప్పి మాట్లాడుకోలేదు. ఇప్పుడు అయాచితంగా దొరికిన ఏకాంతాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలా మాటల మధ్యలో అంతకుముందు రాత్రి గుహలో విషయాలు కూడా దొర్లినాయి. ఆ గోడ పగులుకి అవతల ఏముందో తెలుసుకోవాలనుకున్నారు. అప్పటికే వీళ్ళిద్దరూ వచ్చి గంట దాటింది. అందరు వెతుక్కుంటారేమో అని తిరిగి వీళ్ళు ఉంటున్న చోటికి తిరిగి వచ్చారు. అప్పుడే మిగిలిన వాళ్ళు కూడా ఒకళ్ళ తరవాత ఒకళ్ళు నిద్రలేస్తున్నారు. అడవిలోంచి ఆనందంగా ఒకరి చెయ్యి ఒకళ్ళు పట్టుకుని నడుస్తున్న వీళ్ళని చూసి అంతా ముసిముసిగా నవ్వుకున్నారు. అందరు కాలకృత్యాలు తీర్చుకుని సముద్రపు వడ్డు దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. రేస్క్యు టీం కోసం ఎదురు చూస్తూ గడిపారు. కొంచెం సేపు అయ్యాక "నాకు ఏమి తోచట్లేదు. అలా వొడ్డున కొంచెం దూరం నడుస్తాను" అని లేచింది ఆలేఖ్య. లేస్తూ లేస్తూ వివేక్ వంక ఓర కంటితో చూసింది. వివేక్ కూడా లేచి నిలబడ్డాడు. ఇద్దరు అలా కొంచెం దూరం నడిచాక ఆలేఖ్య సముద్రం లోకి పరుగెత్తుకుంటూ వెళ్ళింది. "ఏయ్ ఏయ్ ఆగు! ఎం చేస్తున్నావ్? వెనక్కి రా! " అని అరుస్తూ వివేక్ కూడా ఆలేఖ్య వెనకాలే పరిగెట్టడం మొదలు పెట్టాడు. ఆలేఖ్య నీళ్ళలోంచి ఒక బాగ్ తీసి "వివేక్! ఇది నా టూల్ కిట్. నాకు ఉద్యోగం వచినప్పుడు మా నాన్నగారు నాకోసం గిఫ్ట్ చేసారు. ఎక్కడికి వెళ్ళినా నాతోటి తీసుకువెళ్తాను. మొన్న ఆక్సిడెంట్లో సముద్రంలో పడిపోయింది. మళ్ళి ఇదిగో ఇప్పుడు దొరికింది." అంది చిన్న పిల్లలా ఆనందిస్తూ. అలా అంటుండగానే కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి. వివేక్ నెమ్మదిగా అనునయించి ఆలేఖ్యని దగ్గరకి తీసుకున్నాడు. ఇద్దరు తిరిగి మిగిలిన వాళ్ళు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికి మిగిలినవాళ్ళకి కూడా బోర్ కొట్టినట్టుంది. ఒడ్డున విమానం నించి విడివడిన సామాను కుప్పలు కుప్పలుగా పడి ఉంది. అందరు తలా ఒక కుప్ప దగ్గరికి వెళ్లి పనికి వచేయి ఎమన్నా ఉన్నాయేమో అని వెతుకుతున్నారు. కొన్ని బట్టలు, కొన్ని వస్తువులు సేకరించారు. అంతా తిరిగి గూడేనికి చేరుకున్నారు. అప్పటికి ఇంకా మధ్యాహ్నమే అయింది. ఎం చెయ్యాలో ఎవ్వరికి తోచలేదు. అప్పుడు సడెన్ గా వివేక్ కి గూడలో కనిపించిన సన్నటి పగులు గుర్తొచ్చింది. ముందు అభ్యంతరం చెప్పినా, చివరికి అందరు ఒప్పుకున్నారు. కొంచెం ఇబ్బందితో అందరు చిత్తడి నేల దాటారు. వివేక్ నిన్న రాత్రి చూసిన పగులుని చూపించాడు. ఒక మనిషి పక్కకి తిరిగి నడిచేంత మాత్రమే ఉంది ఆ పగులు. ముందుగ గ్రెగ్ పగులులోంచి చూసాడు. పడి అడుగుల మందం ఉంది అక్కడ గుహ గోడ. నెమ్మదిగా అటు వైపు వెళ్ళాడు గ్రెగ్. లీ పగులుకి ఎదురుగ కాగడ పట్టుకుని నిలబడ్డాడు. గ్రెగ్ అవతలి వైపుకి చేరగానే ఒకళ్ళ తరవాత ఒకళ్ళు అందరు ఆ పగులులోకి వెళ్లారు. చివరా నాయర్ ఆ పగులులోకి ప్రవేశించాడు. అవతలి దృశ్యం చూడగానే అందరికి మతులు భ్రమించాయ అన్న అనుమానం కలిగింది. అక్కడ పెద్ద ఆడిటోరియంలాగా ఉంది. ఆడిటోరియం గోడలు పచ్చని కాంతితో వెలుగుతున్నాయి. జేమ్స్ గోడ వంక పరీక్షగా చూసి, చిన్న విజిల్ వేసాడు. కొన్ని జీవాలకి వెలిగే గుణం ఉంటుంది. మిణుగురు పురుగు, జెల్లీ ఫిష్ ఆలాంటి కోవకి చెందినవే. ఇప్పుడు గోడ మీద అలాంటి జీవి ఉంది. ఆ గుహ గోడలకి ఒక రకమైన నాచు పట్టింది. దానివల్లే ఆడిటోరియం వెలుగుతోంది. ఆ వెలుగులో ఆడిటోరియంలో ఉన్నవి అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఆడిటోరియంలో కొన్ని gundrati రాళ్ళు పెర్చినట్టు కుప్పలు కుప్పలుగ ఉన్నాయి. రాళ్ళని ఆలా గుహ లోపల ఆడిటోరియం లోకి మోసుకువచ్చి అక్కడ పెట్టినవారెవరో ఎంతకీ అర్థం కాలేదు. వివేక అందులో ఒక రాయిని పట్టుకుని చూసాడు. అది గట్టిగ ఇనప గుండులాగా ఉంది. దాన్ని ఎత్తి నేలకేసి కొట్టాడు. ఖంగు మని శబ్దం వచ్చి గుహ అంతా మారుమోగిపోయింది. ఆ రాయికి పట్టుకుని ఉన్న దుమ్ము అంతా రాలిపోయింది. వివేక కి తన కళ్ళని, నమ్మాలా లేదో అర్థం అవ్వలేదు. తను కింద పడేసింది మామూలు గుండు కాదు. బంగారపు గుండు. ఆ గుండు సుమారుగా అయిదు కిలోలు ఉంది. అందరు సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ నిలబడ్డారు. అందరికన్నా ముందుగ తేరుకున్నది నాయర్. తను చకచక కదిలి మరో రెండు గుండ్లని అలానే నేలకేసి కొట్టాడు. అవి కూడా బంగారు గుండ్లే. ఆలాంటి గుండ్లు సుమారుగా వెయ్యి పైనే ఉన్నాయి. ఎవరో ఆ బంగారు గుండ్లని తయారు చేసి అక్కడ పెట్టినట్టు గ్రహించారు. ఆ రాతి కట్టడాలు, అవి తయారు చేసిన వాళ్ళవి అనిపించింది. ఆ ఆడిటోరియం అవతల చిన్న ద్వారం ఉంది. ఆ ద్వారం గుండా వివేక్, ఆలేఖ్య వెళ్లారు.అక్కడ గోడల మీద కుడ్యచిత్రాలు ఉన్నాయి. అవన్నీ క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల కిందవని వివేక్ ఆలేఖ్య వెంటనే గ్రహించారు. ఆ చిత్రాల నిండా రకరకాల లోహ వస్తువులతో పనిచేస్తున్న మనుషుల చిత్రాలు ఉన్నాయి. ఆ గుహ మొత్తం ఆలాంటి చిన్న చిన్న గదులు బోల్డు ఉన్నాయి. ఇంకొంచెం లోపలి వెళ్తే అక్కడ గుహ మరింత ఎత్తుగా మరింత వెడల్పుగా ఉంది. గుహ బయట ఉన్నట్టుగానే గుహ లోపల కూడా చాలా రాతి కట్టడాలు ఉన్నాయి. అవి అక్కడ ఒకప్పుడు నివసించిన వాళ్ళవి. వాళ్ళు అక్కడ ఉండి వివిధ లోహాలతో పనిముట్లు తయారు చేసుకునే వారు. కానీ బంగారాన్ని ఆలా ముద్దలు ముద్దలు గ చేసి నిలవ ఉంచాల్సిన అవసరం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం అవ్వలేదు. పార్టి గదిలోనూ గోడల మీద బొమ్మలు, పక్కన ఏవో శాసనాలు, కొన్ని గుండ్లు పధ్ధతి ప్రకారం వరసల్లో అమర్చి ఉన్నాయి. ముందుగ ఎక్స్పెక్ట్ చెయ్యకపోవడం వల్ల వివేక్, ఆలేఖ్య తమతో ఏమి తెచ్చుకోలేదు. బయట ఉన్న రాతి కట్టడాలు పాతవి అనుకున్నారు కాని, లోహ యుగానికి చెందినవి అని అనుకోలేదు. అప్పటికే వాళ్ళు గుహలోకి వచ్చి చాలా సేపు అవ్వడంతో వెనక్కి వెళ్లి మళ్ళి మర్నాడు వద్దాం అనుకున్నారు. నాయర్, వివేక్ ఇద్దరు చెరొక బంగారు గుండు బయటకి తీసుకునివచ్చారు. వాళ్ళు బయటికి వచ్చేటప్పటికి చీకట్లు ముసురుకుంటున్నాయి. వెంటనే అందరు కొద్దిగా ఫ్రెష్ అయ్యి, కొన్ని పళ్ళు కోసుకుని వచ్చి మంట చుట్టూ కూర్చున్నారు. అందరికి నోట మాట రావట్లేదు. అంత బంగారం ఎవరు తమ తమ జీవితాలలో చూసుండరు. అంత ఇద్దరు ఇద్దరుగ మాట్లాడుకుంటున్నారు. దీవి నించి బయటపడ్డాక ఆ బంగారంతో ఎవరు ఎం చెయ్యదలుచుకున్నారో మాట్లాడుకుంటున్నారు. నాయర్, వివేక్, ఆలేఖ్య బంగారు ముద్దని పరీక్షిస్తున్నారు. బంగారు ముద్దా మీద ఏదో రాసి ఉన్నట్టు అనిపించింది ఆలేఖ్యకి. వెంటనే వెళ్లి ఆ రోజు పొద్దున్న దొరికిన టూల్ కిట్ తీసుకువచి అందులోంచి భూతద్దం తీసుకుని పరిక్షించసాగింది. తన ఊహ కరెక్ట్. ఆ బంగారు ముద్ద మీద ఏదో రాసి ఉంది. బహుశ ఆ బంగారు గుండ్లని తయారు చేయించిన వాళ్ళ గురించి ఉందేమో అనుకుంది. వెంటనే ఒక పెన్ను, పేపర్ తీసుకుని తనకి కనిపించింది కనిపించినట్టు నోట్ చేసుకోవడం మొదలుపెట్టింది. మొదటి గుండు అయిపోయాక, రెండో గుండు మీద ఏముందో చూసింది. రెండో గుండు మీద కూడా సుమారుగా మొదటి గుండు మీద ఉన్నదే ఉంది. నోట్ చేసుకోవడం అయ్యాక నాయర్, వివేక్, ఆలేఖ్య దాన్ని విశ్లేషించడం మొదలుపెట్టారు. మిగిలిన వాళ్ళు ఇంకా వాళ్ళ వాళ్ళ కబుర్లలో ఉన్నారు. కొంచెం సేపటికి అందరికి బోర్ కొట్టడం మొదలుపెట్టింది. క్రిస్టినా, గ్రెగ్ లేచి నిలబడ్డారు. వాళ్ళు ఇద్దరు మండుతున్న నెగడు లోంచి ఒక కొమ్మ తీసుకుని అడవిలోకి వెళ్లి వస్తామన్నారు. "ఎక్కువ దూరం వెళ్ళకండి. అడవిలో మిమ్మల్ని వెతకడం కష్టమవుతుంది" అన్నాడు జేమ్స్. నాయర్ నవ్వుతు "వెళ్ళని లే, మనకి బంగారం ఇంకొంచెం ఎక్కువ దక్కుతుంది" అన్నాడు. లిప్త పాటు గ్రెగ్ మొహంలో నవ్వు మాయం అయ్యింది, మళ్ళి నవ్వు తెచ్చుకుంటూ ". ఒక గంట తరవాత గ్రెగ్, క్రిస్టినా తిరిగి వచ్చేసారు. అప్పటిదాకా ఏదో సీరియస్ విషయం మాట్లాడుకున్నట్టు ఇద్దరు గంభీరంగా ఉన్నారు. అందరు పళ్ళు తిని పడుకున్నారు. "ఆలేఖ్య నువ్వు కూడా పడుకో. రేపు చూసుకుందాము" అన్నాడు నాయర్.
No comments:
Post a Comment