Pages

Sunday, December 6, 2009

అసుర సంధ్య - 5

వివేక్, ఆలేఖ్య ఇద్దరు ఆ పరిసరాలని గమనించడంలో మునిగిపోయారు. లీ, జేమ్స్ ఇద్దరికీ ఇంటరెస్టింగ్ గానే ఉన్న, అక్కడ వాళ్ళు ఎం చెయ్యడానికి లేక పోవడం తో కొంచెం ముందుకి వెళ్దామని బయలుదేరారు. వివేక్ ఆలేఖ్య కొంచెం సేపు అక్కడి పరిసరాలని చూసాక, అక్కడి బొమ్మలని పరిశీలించాక ఒక నిర్ధారణ కి వచ్చారు. అది ఒక ప్రయోగ శాల. అక్కడ ఆ దీవి సంరక్షకుడు అయిన మాంత్రికుడు రక రకాల ప్రయోగాలు చేసేవాడు. రకరకాల పొడులు, మూలికలు తాయారు చేసేవాడు. సాధారణంగా అవి వాడడం రాని వాళ్ళు వాడితే వికటిస్తాయి. అందుకని అలంటి వాటిని జాగ్రత్తగా మరో చోట దాచిపెడతారు. ఇది సాధారణంగా నేటి రీసెర్చ్ ల్యాబ్స్ లో కూడా అదే పధ్ధతి అనుసరిస్తారు. లాబ్లో తాయారు అయిన వాటిని ప్రత్యేకమైన వాల్ట్ లో పెడతారు. అక్కడికి చాల తక్కువ మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటిదే ఉంటుంది. జాగ్రత్తగా వెతికితే ఏంటో శక్తివంతమైన మిశ్రమాలు దొరికే అవకాశం ఉంది. వివేక్ ఆలేఖ్య అక్కడ చుట్టుపక్కల అంతా వెతికారు కానీ వాళ్ళకి అలంటి సదుపాయం ఏమి కనిపించలేదు. అక్కడ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాలేచ్ట్ చేసుకున్నాక లీ జేమ్స్ ఎక్కడ ఉన్నారో అని బయలుదేరారు. వాళ్ళు బయలుదేరారో లేదో పెద్ద ఆర్తనాదం ఒకటి వినిపించింది. అది లీ గొంతులా ఉంది. వెంటనే వివేక్, ఆలేఖ్య ఇద్దరు ఆ అరుపు వినిపించిన వైపు పరుగెత్తారు. అక్కడికి కొంచెం ముందుకు వెళ్తే గోడలోకి తొలిచిన చిన్న కన్నం ఉంది. ఆ కన్నం కేవలం మూడు అడుగుల వెడల్పు అంటే పొడవులో ఉంది. లీ అరుపులు వినపడక పోతే ఆ కన్నాన్ని గమనించే వాళ్ళు కాదు. చెట్టు తోర్రలాంటి ఆ కన్నంలోంచి వివేక్ తల పెట్టి చూసాడు. లోపల లీ నెల మీద పడి దొర్లుతున్నాడు.నెమ్మదిగా వివేక ఆ కన్నంలోంచి అవతలికి దూరి జేమ్స్ దగ్గరికి వెళ్ళాడు. జేమ్స్ అప్పటికే లీ కి ఏమయ్యిందో పరిక్షుస్తున్నాడు. "లీ కి ఏమయింది జేమ్స్? ఎందుకలా పడిపోయాడు?"
"నేను, లీ నడుస్తుంటే లీ ఒక రాయి మీద చెయ్యి వెయ్యగానే ఈ తొర్ర ప్రత్యక్షమయింది. లీ నేను అతి కష్టం మీద లోపలకి వచము. నేను ఒక వైపు లీ ఒక వైపు గోడలని పరిక్షిస్తున్నాము ఇంతలొ ఏమయిందో ఏమో లీ ఉన్నట్టుండి గట్టిగ అరిచి పడిపోయాడు. బహుశ స్పృహలో లేడు అనుకుంటా. ఇతన్ని వెంటనే బయటకి తీసుకువెళ్ళాలి. ఫ్రెష్ ఎయిర్ చాల అవసరం. కొద్దిగా హెల్ప్ చెయ్యి." ఇద్దరు కస్టపడి ఎలాగో అలాగా లీ ని గుహ బయటకి తీసుకువచ్చారు. వెనకాలే ఆలేఖ్య కూడా వచ్చింది. గుహ బయటకి రాగానే, లీ మొహం చూడగానే జేమ్స్ కి అర్ధం అయ్యింది. లీ మొహం అంతా చీమలు కుట్టినట్టు ఎర్రగా కందిపోయి దద్దుర్లు దద్దుర్లు గ ఉంది. లీ అక్కడ గుహ లో ఉన్నప్పుడు ఏదో పురుగుని ముట్టుకున్నట్టు ఉన్నాడు. మొహం అంతా ఉబ్బిపోయి వికారంగా తయారయింది. వెంటనే జేమ్స్ చుట్టూ చూసి ఏవో పొద నించి కొన్ని ఆకులు తెంపి అరచేతులతో నూరి ఆ రసం లీ మొహం మీద పడేటట్టు గ పిండాడు. కొంచెం సేపటికి లీ కి మెలకువ వచ్చింది.అందరు ఆదుర్దా గ తననే చూస్తున్నారు."ఏమయింది ! అలా ఎందుకు అరిచావు? " అడిగాడు జేమ్స్. "నేను గోడలని తడుముతూ ఉండగా చిన్న అర లాంటిది చేతికి తగిలింది. అందులో ఏముందో అని వేలు కొంచెం లోపలి పెట్టగానే ఏదో గ్యాస్ లాగా వచ్చింది. తరవాత ఏమయ్యిందో నాకు తెలిదు" . "ఎస్. అక్కడ బంగారం కన్నా విలువ అయింది ఏదో ఉంది. అందుకే బంగారాన్ని గాలికి వదిలేసి దీన్ని మాత్రం చాల పకడ్బందీగా దాచిపెట్టారు." అన్నాడు వివేక. "మనం మొదట వెళ్ళిన గది ఒక లాబొరేటరి. అక్కడ రక రకాల ప్రయోగాలు చేసి ఉంటారు. ఆ కెమికల్స్ అన్ని ఎక్కడో దాచి ఉంటారు. బహుశ నీకు తగిలింది ఆ గదికి సంబంధించిన తాళం అయి ఉంటుంది. ఆ గది తెరవడం వల్ల మనుషులందరికీ పనికి వచ్చే ఎన్నో మందులు బయటపడొచ్చు." అంది ఆలేఖ్య. అందరు సాలోచనగా చూసారు. ఆలేఖ్య చెప్పింది నిజమే. కొన్ని ఆటవిక తెగలలో చనిపోయిన వారి తలకాయలని ఒక రకమైన ఆకు పసరులో నానబెట్టి దాన్ని నిప్పుల మీద కాల్చితే తలకాయ పిడికిలి సైజులోకి కుదించుకుపోతుంది. అలంటి తలలు చాల లభించాయి. ఆ ఆకు పసరు ఫార్ములా తెలుసుకో గలిగితే ట్యూమర్ తగ్గించడానికి అత్యంత బాధాకరమైన కేమో థెరపీ లేకుండానే తగ్గించవచ్చు. ఒక డాక్టర్ గ జేమ్స్ కి ఈ సంగతి తెలుసు. ఎన్నో నాగరికతల్ని చదివిన వివేక, ఆలేఖ్యలకి కూడా ఈ సంగతి తెలుసు. కాని వీళ్ళ అందరికి తట్టని విషయం ఇంకోటి ఉంది. విజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. మంచికి ఉపయోగ పడినట్టే చెడుకి కూడా ఉపయోగ పడుతుంది. బహుశ ఆ సంగతి గ్రహించి బాధ పడ్డ మొదటి వ్యక్తీ ఐన్ స్టీన్ అనుకుంటా. ఆటం బాంబ్ కనిపెట్టడం వల్ల జరిగిన ప్రళయం చూసాక ఎంతో మానసిక వ్యధకి గురి అయ్యుంటాడు.

లీ కొద్దిగా తేరుకున్నాడు. మొహం మాములుగు అయ్యింది కాని ఇంకా క్నోచ్మే నలతగానే కనిపిస్తున్నాడు. లీ ని ఖాలీ ప్రదేశంలో కూర్చోబెట్టి జేమ్స్ వివేక్ ఏవో పళ్ళు తీసుకుని వచ్చారు తినటానికి. ఆలేఖ్య గుహ లో చూసిన సంఘటనల గురించి ఆలోచిస్తోంది. అందరు పళ్ళు తినేసాక, ఆల్కేహ్య చుట్టూ చూస్తె "గ్రెగ్ క్రిస్టినా వెళ్లి చాల సేపు అయ్యింది. ఇద్దరు ఏమి చేస్తున్నారో ఏమో?" అంది. జేమ్స్ భావ రహితంగా ఒక చూపు చూసి ఊరుకున్నాడు. అది గమనించి వివేక్ ఏదో అన బోయి ఆగిపోయాడు. ఆల్కేహ్య కి గుహలోకి వెళ్ళే ముందు జరిగినఆర్గుమెంట్ గుర్తు వచ్చింది.
"నాయర్ ఎలా చనిపోయాడో మనకి కొద్దిగా అర్థం అయ్యింది. కానీ మనం వెళ్ళిన చోటికి కాకుండా నాయర్ వేరే చోటికి వెళ్లి ఉంటాడు. లీ తో పటు మనం ఇద్దరం ఉండబట్టి సరిపోయింది లేక పోతే లీ ఆ కన్నం లోంచి బయట పడేవాడు కాదు. నాయర్ ని రక్షించడానికి ఎవ్వరు లేరు కనక నాయర్ కూడా అదే చోటికి వెళ్ళాడు అనుకోవడానికి లేదు. ఒక వేల లీ స్థానం లో నాయర్ ఉంది ఉంటె అక్కడికక్కడే చనిపోయేవాడు. నాయర్ తనంతట తను తిరిగి బయటకి నడుచుకుంట రాగలిగాడు అంటే నాయర్ వేరే చోటికి వెళ్లి ఉంటాడు. మనం ఎక్కువ రోజులు ఈ దీవిలో ఉండడం అంత మంచిది కాదు. రేపటి నించి ఈ గుహ దగ్గర కక్కుండా మనం సముద్రం దగ్గర ఎక్కువ సమయం గడుపుదాం. మనల్ని వెతుక్కుంటూ వచ్చే వాళ్ళకోసం ఎదురు చూడం తప్ప్ప ఇలా చావుని వెతుక్కుంటూ మనం వెళ్లొద్దు. టైం కలిసి వస్తే బంగారాన్ని అందర్మ తీసుకుని వెళ్ళొచ్చు." అన్నాడు జేమ్స్.
అది కరెక్ట్ అనిపించింది అందరికి. వీలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే గ్రెగ్ క్రిస్టినా తిరిగి వచ్చారు. వాళ్ళని చూడగనే మిగిలిన వాళ్ళందరికీ ఏదో జరిగింది అని అర్థం అయ్యినిడ్. క్రిస్టినా మోహంలో ఏదో తెలియని ఆత్రుత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎం జరిగిందో అడుగుదామని ఆలేఖ్య నోరు తెరవబోతుంటే జేమ్స్ కళ్ళతోనే వారించాడు. గ్రెగ్ లీ ని చూడగానే “ఎం జరిగింది ! లీ అలా ఉన్నాడేమిటి?" అని అడిగాడు. వివేక్ జరిగింది చెప్పాడు. అంట విని గ్రెగ్ "మనకి తెలియని రహస్యాలు ఈ గుహ లో చాల ఉన్నట్టు ఉన్నాయి. మనం అంతా మరో సారి ఆ గుహలోకి వెళ్ళడం మంచిదేమో. మన ఎవరికీ తెలియని ఎన్నో రహస్యాలు తెలుసుకోవచ్చు” అన్నాడు గ్రెగ్. అంతా అతని వంక విచిత్రంగా చూసారు. కేవలం కొన్ని గంటల ముందు అనవసరంగా మన ప్రాణాలు రిస్క్ చెయ్యడం ఎందుకు అని అడిగిన మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాదేమిత అని అందరికన్నా మొదట అనుమానం వచ్చింది జేమ్స్ కి. వయసు నేర్పిన అనుభవం వల్ల జేమ్స్ అప్పుడేమి మాట్లాడలేదు. మాట్లాడి ఉంటె అక్కడ గ్రెగ్ చేతిలో ఎన్ని ప్రాణాలు పోయేవో?
జేమ్స్ అంతరంగంలో ఎన్నో ప్రశ్నలు చెలరేగుతున్నాయి. కొన్ని గంటల ముందు మాట్లాడినదానికి పూర్తీ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. అంటే అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఏదో మారింది. గ్రెగ్ క్రిస్టినా ఇద్దరు తిరిగి వచినప్పటి నించి క్రిస్టినా అదోలా ఉంది. ఎందుకో మాటిమాటికి గ్రెగ్ ని వెతుక్కుంటోంది. ఎక్కడికో వదిలి వెళ్ళిపోతాడు అన్న భావన కనిపిస్తోంది తన కళ్ళలో. చుట్టూ సముద్రం తప్ప ఏమి లేని దీవిలోంచి తప్పించుకోవాలి అంటే రెండే రెండు మార్గాలు. ఒకటి ఈదుకుంటూ వెళ్ళడం. రెండు ఏదన్న పడవ ఎక్కి వెళ్ళడం. మొదటిది అసంభవం కనక గ్రెగ్ కి ఏదన్న పడవ దొరికిందా? అయితే ఆ సంగతి అందరికి చెప్పలేదేందుకు?
సమాధానం తెలియని ఈ ప్రశ్నలనించి మనసుని డైవర్ట్ చెయ్యడానికి తల గట్టిగ విదిలించాడు జేమ్స్. అప్పటికి గాని గ్రెగ్ తననే అబ్జర్వ్ చేస్తున్న సంగతి గమనించలేదు. గమనించగానే జేమ్స్ వళ్ళు జలదరించింది. ఆ చూపులు కుందేలు మీద పంజా విసిరే సింహం చూపులా చాల నిర్లిప్తంగా ఉంది.

ఆ తరవాత చాల సేపటికి గాని జేమ్స్ ఆ చూపులని మర్చిపోలేకపోయాడు. ఆ రాత్రి అంతా కూడా జేమ్స్ కి నిద్ర పట్టలేదు. ఏ చిన్న చప్పుడు అయిన చటుక్కున లేచి కూర్చుంటున్నాడు. అలా కొంత సేపు అయ్యాక, జేమ్స్ ఇంక ఉండబట్టలేక, చల్ల గాలికి తిరిగితే అయినా కొంచెం నిద్ర పడుతుందేమో అన్న ఆలోచనతో లేచి ఇవతలికి వచ్చాడు. అలా వస్తుండగా గుహలోంచి వినిపించింది ఒక పెద్ద అరుపు. ఆ అరుపు మాములుగా లేదు. ఏదో అడవి జంతువు ఆకలితో అలమటిస్తున్న అరుపుల ఉంది. వాళ్ళు ఆ దీవిమీదకి వచ్చి అప్పటికే సుమారుగా వారం అయిఉంటుంది. వాళ్లకి ఎక్కడ పెద్ద జంతువులు కనిపించలేదు. ఆ అరుపు చాల వికృతంగా ఉంది. జేమ్స్ కి తెలిసినంత వరకు అటువంటి అరుపు ఎప్పుడు విని ఉండలేదు. ఆ అరుపుకి మిగిలిన వాళ్ళు కూడా కంగారుగా లేచి వచ్చారు.
లీ వస్తూనే "గ్రెగ్, క్రిస్టినా ఏరి?" అని అడిగాడు.
అప్పటి వరకు అక్కడ గ్రెగ్, క్రిస్టినా లేరు అన్న సంగతి జేమ్స్ కి గాని, ఆలేఖ్య వివేక్ కి కానీ స్ఫురించలేదు. ఇంతలో గుహలోంచి మళ్ళి ఆ అరుపు వినిపించింది. ఆ అరుపు వెనకే మరో గొంతు వినిపించింది.
"అది క్రిస్టినా గొంతు" అంది ఆలేఖ్య.
వెంటనే గుహ లోకి లీ, వివేక్ సంధించి వదిలిన బాణంలా పరుగు తీసారు. వెళ్తూ వెళ్తూ లీ రెండు ఎండు కొమ్మలు విరిచి వివేక్ కి ఒకటి ఇచ్చి తను ఒకటి పట్టుకున్నాడు. వెనకాలే జేమ్స్, ఆలేఖ్య అందుబాటులో ఉన్న రాళ్ళు తీసుకుని పరిగెత్తారు. గుహలోకి వెళ్ళాక అరుపులు మరింత ఎక్కువ అవ్వసాగాయి. నలుగురు అరుపులు వినిపిస్తున్న దిశలోకి పరుగెత్తారు. ఆ దారి మలుపులు తిరుగుతూ వీళ్ళు కూడా పరుగు తీసారు. ఒక మలుపులో ఉన్న రాయిని తప్పించుకోబోయి లీ బోర్ల పడిపోయాడు. ఆ వెనకాలే వస్తున్నా వివేక్ లీ ని లేపుదామని కిందకి వంగినవాడు అలానే స్థాణువులా ఉండిపోయాడు. కొంచెం ఆలస్యంగా అక్కడికి వచ్చిన ఆలేఖ్య, జేమ్స్ కూడా వివేక్ చూస్తున్న వైపు చూసి ఎక్కడి వాళ్ళు అక్కడే బిగుసుకుపోయారు. అక్కడ ఏముందా అనుకుంటూ అటు వైపు చూసిన లీ తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. అక్కడ సుమారుగా పది అడుగుల ఎత్తు ఉన్న జంతువు ఏదో ఉంది. మొసలిని పోలిన ఆ జంతువు ఒళ్ళంతా పొలుసులు పొలుసులుగ ఉంది. వీపు మీద అర చెయ్యి అంతా మొప్పులు తల నించి నడుము దాక ఉన్నాయి. ఆ జంతువు కోరలు పది అంగుళాల పొడవు ఉన్నాయి. నోటి నించి లాలాజలం కారుతూ చూడడానికి చాల అసహ్యంగ భయంకరంగా ఉంది. ఆ జంతువు తన ఎర్రటి కళ్ళతో ఎదురుగ ఉన్న క్రిస్టినా వంకే చూస్తుంది. రక్తం ఓడుతున్న చేతులతో క్రిస్టినాని పట్టుకోవడానికి విఫలయత్నం చేస్తోంది. ఆ దృశ్యం చూడగానే నలుగురు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ జంతువు మీద ఎదురుదాడి ప్రారంభించారు. అప్పటి దాక క్రిస్టినా మీద దాడి చేస్తున్న ఆ జంతువు సడెన్గా ఎదురయిన ప్రతిఘటనకి బిత్తరపోయింది. క్రిస్టినాని పట్టుకునే ప్రయత్నం విరమించుకుని గుహ లోపలి పరుగెత్తుకుంటూ అక్కడున్న చీకటి సందుల్లో దూరి మాయం అయిపొయింది.
"ఏమయ్యింది? ఇంత రాత్రి పూట ఇక్కడికి ఎందుకు వచ్చావ్? అసలు ఆ జంతువు ఏంటి? ఎక్కడి నించి వచ్చింది?" అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది ఆలేఖ్య. ఇంక భయంతో బిగుసుకుపోయిన క్రిస్టినా ని నెమ్మదిగా బయటికి తీసుకు వచ్చారు. బయటికి వచ్చిన కొంత సేపటికి క్రిస్టినా షాక్ నించి తేరుకుంది. నెమ్మదిగా ఆ రోజు మధ్యాహ్నం నించి జరిగిన సంగతులు చెప్పడం మొదలు పెట్టింది:

పడవని పొదల మాటున దాచేసి చేతులు దులుపుకుంటూ ఇవతలికి వచ్చాడు గ్రెగ్. అదంతా అవ్వడానికి సుమారుగా అరగంట పైనే పట్టింది. గ్రెగ్ చంపి సముద్రంలో విసిరేసిన శవాల జాడ కనిపెట్టినట్టున్నాయి చేపల మీద బతికే కొన్ని సముద్రపు పక్షులు. నెమ్మదిగా గుంపులు గుంపులుగా శవాల మీద వాలి దొరికినంత ముక్క ముక్కున కరుచుకుని గూటిలో ఉన్న పిల్లలకి ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాయి. వాటినే చూస్తున్న క్రిస్టినా కి మాంసపు ముద్దలా మీద వాలుతున్న ఆ పక్షులకి మనుషులకి పెద్ద తేడా కనిపించలేదు. మనిషి కూడా అంతే. దొరికిన వాటిని దొరికినట్టు తన పరివారానికి మొత్తం అందేలా దాచేస్తాడు. కాకపోతే ఇక్కడ మనుషులకి పక్షులకి కొంచెం తేడా ఉంది. మనిషి తన స్వార్ధానికి తోటి మనిషిని చంపి అయినా తను లాభం పొందుతాడు. పక్షులు అలా కాదు. కనీసం తమ జాతి పక్షులని స్వార్థానికి చంపవు. ఇలా సాగుతున్నాయి క్రిస్టినా ఆలోచనలు. ఇంతలో గ్రెగ్ వస్తున్న అలికిడికి అటు వైపు తిరిగింది.
"ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావ్?" అన్నాడు.
"ఇంతకీ పడవని ఎందుకు దాచేసావ్? అందరం కలిసి వెళ్లిపోవచ్చు కదా!" అంది.
"ఆ పడవ బయట అలానే ఉంచేస్తే వీళ్ళని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళకి ఈజీగా దొరికిపోతాం. అప్పుడు వాళ్ళు మనకి పోటి వస్తారు. బంగారం లో మనకి వచ్చే షేర్ తగ్గిపోతుంది" అన్నాడు.
"నీ ప్లాన్ ఏంటి? అంత బంగారాన్ని ఎప్పుడు ఎలా తీసుకువద్దాం?" అడిగింది క్రిస్టినా.
"వీళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు. అందరు పడుకున్నప్పుడు నెమ్మదిగా మనం ఇద్దరం గుహ లోకి వెళ్లి నెమ్మది నెమ్మది గా మోయ్యగలిగినన్ని తీసుకుని వచ్చేద్దాం. ఈరోజు మనం చెయ్యాల్సిన పనులు చాల ఉన్నాయి. పద! అడివిలోకి వెళ్లి మనకి కావాల్సిన సరంజామా సిద్ధం చేసుకుందాం" అన్నాడు.
వడివడిగా అడుగులు వేసుకుంటూ సముద్రపు ఒడ్డున పడి ఉన్న సామాన్లలోంచి కొంచెం పెద్దగ, బలంగా ఉన్న సూట్ కేస్లు రెండు పట్టుకు వచ్చాడు. అలానే అడివిలోకి వెళ్లి బలంగా ఉన్న రెండు మూడు కొమ్మలని విరిచి, వాటి మొదల్లని పదునుగా చెక్కాడు. అవి ఈటేల్లాగా ఉన్నాయి.
వాటిని చూడగానే క్రిస్టినా భయంగా "అవి ఎందుకు. మనం బంగారం మోసుకు రావడానికి సూట్ కేస్లు ఉన్నాయి కదా. మళ్ళి ఇవి ఎందుకు?"
క్రిస్టినా ప్రశ్న కి బదులు చెప్పకుండా, గ్రెగ్ ఆ సూట్ కేస్లని మిగలిన వాళ్ళ కంట బడకుండా గుహ దగ్గరికి చేర్చాడు. చేర్చి ఇద్దరు కలిసి మిగలిన వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు.
గ్రెగ్ కి మిగలిన వాళ్లకి వాటా ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే లీ కి జరిగిన సంఘటనని తనకి అనుకూలంగా మార్చుకుందామని ప్రయత్నించాడు. అందరిని గుహ లోకి వెళ్దాము అని ప్రోత్సహించాడు.
లీ కి జరిగినట్టే మిగిలిన వాళ్ళకి కూడా ఏదన్న ప్రమాదం జరిగి వాళ్ళంతట వాళ్ళు చనిపోతారేమో అనుకున్నాడు. కాక పోతే జేమ్స్ ప్రవర్తనలో ఏదో మార్పు గమనించి ఆగిపోయాడు.
అందరు పడుకున్నాక, గ్రెగ్ క్రిస్టినాని నెమ్మదిగా తట్టి లేపాడు. ఇద్దరు కలిసి నెమ్మదిగా గుహలోకి వెళ్లారు. బంగారం ఉన్న చోటికి వెళ్తుండగా గ్రెగ్ కి ఏదో అలికిడి వినిపించి అటు వైపు కాకుండా మరో వైపు దారి తీసాడు.
అలా కొంచెం ముందుకి వెళ్ళాక, అక్కడ కొన్ని విగ్రహాలు కనిపించాయి. వాటిలోంచి శబ్దాలు వస్తున్నాయి.
క్రిస్టినా కొంచెం భయం భయం గా "గ్రెగ్! మనం వెల్లిపోదాం. నాకెందుకో భయంగా ఉంది. విగ్రహాలలోంచి శబ్దాలు వస్తున్నాయి. ప్లీజ్ నా మాట విను వెళ్లి పోదాం" అంది
"అదేం లేదు నువ్వు ధైర్యంగా ఉండు. బహుశ ఇది మనం మొదటి రోజు నించి వింటున్న శబ్దాలేమో. గాలి చేస్తున్న శబ్దాలు అని భ్రమించాం. ఈ సంగతేంటో తెల్చేస్తాను చూడు " అన్నాడు.
ఆ విగ్రహాన్ని పరీక్షిస్తూ విగ్రహం పక్కన ఉన్న ఒక రాయిని కదిపాడు. ఆ రాయి కదలడం, విగ్రహం ప్రాణమున్న జంతువుల మారడం ఒకేసారి జరిగాయి. ఆ జంతువు ప్రాణం రాగానే, తనకి అతి సమీపం లో ఉన్న గ్రెగ్ తలని ఒక చేత్తో, భుజాలని ఒక చేత్తో పట్టుకుని తలని ఒక్క ఊపులో మెడ నించి వేరు చేసేసింది. జరిగింది ఏమిటో క్రిస్టినా కి అర్థం అయ్యేలోపు గ్రెగ్ మొండాన్ని విసిరేసి క్రిస్టినా మీదకి వచ్చేసింది. దాని బారి నించి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా జేమ్స్, వివేక్, లీ, ఆలేఖ్య వచ్చి క్రిస్టినా నికాపాడారు.

No comments:

Post a Comment